Telangana Tourism Srisailam Package : పలు అధ్యాత్మిక ప్రాంతాలను చూసేందుకు తెలంగాణ టూరిజం పలు ప్యాకేజీలను ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా శ్రీశైలంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను చూసేందుకు సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది.
ఈ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి బస్సు జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తుంది. ప్రతిరోజూ ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఈ ట్రిప్ లో భాగంగా…. శ్రీశైలం దర్శనం, పాతాళగంగా, పాలధార(Paaladhara), పంచధార, శ్రీశైలం డ్యామ్ ప్రాంతాలను చూడొచ్చు.
యాదాద్రితో పాటు మరికొన్ని ఆలయాలను చూసేందుకు తెలంగాణ టూరిజం మరో కొత్త ప్యాకేజీని ప్రకటించింది.కేవలం ఒక్క రోజులోనే ఈ టూర్ ముగుస్తుంది. అతి తక్కువ ధరలోనే ప్రతి శనివారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. బస్సు జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు.