TS TET Results 2024 : జూన్ 12న తెలంగాణ టెట్ ఫలితాలు...!-telangana tet results 2024 will be released on june 12 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Tet Results 2024 : జూన్ 12న తెలంగాణ టెట్ ఫలితాలు...!

TS TET Results 2024 : జూన్ 12న తెలంగాణ టెట్ ఫలితాలు...!

TS TET Results 2024 Updates: తెలంగాణ టెట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. జూన్ 2వ తేదీతో పరీక్షలన్నీ పూర్తి కానున్నాయి. ఫలితాలను జూన్ 12వ తేదీన ప్రకటించనున్నారు.

తెలంగాణ టెట్ ఫలితాలు - 2024

TS TET Results 2024 : తెలంగాణ టెట్ - 2024 పరీక్షలు కొనసాగుతున్నాయి. మే 20వ తేదీ నుంచి ఈ పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.  పేపర్ 2 పరీక్షలు ఇప్పటికే పూర్తి కాగా… పేపర్ -1 పరీక్షలు జరగాల్సి ఉంది. ఈ పరీక్షలన్నీ కూడా జూన్ 2వ తేదీతో పూర్తి కానున్నాయి.

జూన్ 12న ఫలితాలు…!

జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ టెట్ పరీక్షలు పూర్తి అవుతాయి. విద్యాశాఖ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం…. జూన్ 12వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నారు. పరీక్షలు పూర్తి అయిన పది రోజుల వ్యవధిలోనే టెట్ రిజల్ట్స్ అందుబాటులోకి రానున్నాయి.

ఈసారి నిర్వహిస్తున్న టెట్ పరీక్ష(TS TET Exams 2024) కోసం మొత్తం 2,83,441 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్ 1 కోసం 99,210 మంచి నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఇక పేపర్‌-2(TET Paper 2)కు 1,84,231 మంది అప్లయ్ చేశారు. 

How to Check TS TET Results 2024 : టీఎస్ టెట్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి

  • తెలంగాణ టెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు మొదటగా https://tstet2024.aptonline.in/tstet/   వెబ్ సైట్ లోకి వెళ్లండి.
  • TS TET Results 2024 అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • మీ హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేసి… Get Results పై క్లిక్ చేయాలి.
  • మీ స్కోర్ కార్డు ఇక్కడ డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీని పొందవచ్చు.
  • డీఎస్సీ ఉద్యోగ నియామక పరీక్షలో టెట్ స్కోర్ కీలకం.
  • భవిష్యత్ అవసరాల దృష్ట్యా టెట్ స్కోర్ కార్డు కాపీ జాగ్రత్తగా ఉంచుకోవాలి.

జూన్ 2తో పరీక్షలు పూర్తి…

  • మే 30 , 2024– పేప‌ర్ 1 -(సెష‌న్ – S1)
  • మే 30, 2024 – పేప‌ర్ 1- (సెష‌న్ – S2)
  • మే 31, 2024 – పేప‌ర్ 1 -(సెష‌న్ – S1)
  • మే 31, 2024 – పేప‌ర్ 1 -(సెష‌న్ – S2)
  • జూన్ 1 , 2024– పేప‌ర్ 2- మ్యాథ్స్ అండ్ సైన్స్ (మైన‌ర్ మీడియం)(సెష‌న్ – S1)
  • జూన్ 1, 2024 – పేప‌ర్ 1-(మైన‌ర్ మీడియం) (సెష‌న్ – S2)
  • జూన్ 2 , 2024– పేప‌ర్ 1 -(సెష‌న్ – S1)
  • జూన్ 2 , 2024– పేప‌ర్ 1- (సెష‌న్ – S2).

మరోవైపు తెలంగాణలో  మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కూడా పూర్తి అయింది. ఇందుకు సంబంధించిన పరీక్షలు జులై 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.జులై 31వ తేదీతో ఈ ఎగ్జామ్స్ ముగుస్తాయని విద్యాశాఖ వెల్లడించింది.

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు.ఇందులో 2629 స్కూల్‌ అసిస్టెంట్, ఎస్జీటీలు 6,508, భాషా పండితులు 727, పీఈటీలు 182, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) 796 కొలువులు ఉన్నాయి.