TG TET 2024 Registrations: రేపటి నుంచి తెలంగాణ టెట్ రిజిస్ట్రేషన్లు, సాంకేతిక కారణాలతో ఆలస్యం-telangana tet registrations from tomorrow delayed due to technical reasons ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Tet 2024 Registrations: రేపటి నుంచి తెలంగాణ టెట్ రిజిస్ట్రేషన్లు, సాంకేతిక కారణాలతో ఆలస్యం

TG TET 2024 Registrations: రేపటి నుంచి తెలంగాణ టెట్ రిజిస్ట్రేషన్లు, సాంకేతిక కారణాలతో ఆలస్యం

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 06, 2024 06:32 AM IST

TG TET 2024 Registrations: తెలంగాణ టెట్‌ 2024-25 రిజిస్ట్రేషన్లు నవంబర్ 7వ తేదీ గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. మంగళవారం నుంచి టెట్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావాల్సి ఉన్నా దరఖాస్తులు రుసుముపై ఉన్నత స్థాయిలో ఎలాంటి నిర్ణయం వెలువడక పోవడంతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.

రేపటి నుంచి తెలంగాణ టెట్ 2024 రిజిస్ట్రేషన్లు ప్రారంభం
రేపటి నుంచి తెలంగాణ టెట్ 2024 రిజిస్ట్రేషన్లు ప్రారంభం

TG TET 2024 Registrations: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌ 2024 నోటిఫికేషన్ రెండు రోజుల ఆలస్యంగా విడుదల కానుంది. మంగళవారం టెట్ నోటిఫికేషన్‌ వెలువడుతుందని పాఠశాల విద్యాశాఖ ప్రకటించినా పలు కారణాలతో అది విడుదల కాలేదు. మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల అవుతందని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, తెలంగాణ టెట్ చైర్మన్, ఈవీ నరసింహారెడ్డి తొలుత వెల్లడించారు.

నవంబర్ఈ 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు టెట్‌ పరీక్ష దరఖాస్తులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. టెట్‌ విద్యార్హతలు, సెకండరీ గ్రేడ్‌, స్కూల్‌ అసిస్టెంట్ సబ్జెక్టులు, అర్హతల వివరాలను మంగళవారం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 7వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.

టెట్‌ పరీక్ష ఫీజును గతంలో రూ.1000కు పెంచడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. వాటిని తగ్గిస్తామని రేవంత్‌ రెడ్డి గతంలో హామీ ఇచ్చారు. దీంతో పాటు గత మేనెలలో జరిగిన టెట్‌లో క్వాలిఫై కాలేకపోయిన వారికి పరీక్ష ఫీజు మినహాయింపు ఇస్తామని ప్రకటించారు. తాజాగా టెట్‌ నిర్వహణపై ఫీజు మినహాయింపుపై ఉత్తర్వులు వెలువడలేదు.

మరోవైపు తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆన్లైన్ పరీక్షలను జనవరి 1-20 తేదీల మధ్య నిర్వహిస్తారు. మార్చిలో ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలను నిర్వహించాల్సి ఉండటంతో జనవరిలోనే టెట్ పరీక్షలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. తెలంగాణలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెట్ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ అకడమిక్‌ క్యాలెండర్‌ను కూడా గతంలోనే విడుదల చేసింది.

టెట్‌ పరీక్షల్లో రెండు పేపర్లు ఉంటాయిన నోటిఫికేషన్‌ విడుదలలో పేర్కొన్నారు. పేపర్-1కు డీఈడీ, పేపర్-2కు బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు. మొత్తం150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఓసీ అభ్యర్థులకు-90 మార్కులు, బీసీలకు 75, మిగిలిన వారికి 60 మార్కులు వస్తే టెట్‌ ఉత్తీర్ణులుగా గుర్తిస్తారు. రిజర్వేషన్ల ఆధారంగా నిర్దేశిత మార్కులు సాధించిన వారికి మాత్రమే డీఎస్సీ రాసేందుకు అవకాశం లభిస్తుంది.

ప్రాథమిక పాఠశాలల్లోని సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) ఉద్యోగాలకు అర్హత పొందేందుకు పేపర్-1లో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ఉన్నత పాఠశాలల్లోని స్కూల్ అసి స్టెంట్ ఉద్యోగాలకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. పేపర్-2లో గణితం, సైన్స్, సాంఘికశాస్త్రం రెండు వేర్వేరు పేపర్లు ఉంటాయి. టెట్‌ పరీక్షల్లో ఒకసారి పాసైతే ఆ స్కోర్కు జీవితకాలు గుర్తింపు ఉంటుంది. 2022 నుంచి ఈ మేరకు నిబంధనలు మార్చారు.

టెట్‌ పరీక్షల్లో వచ్చిన మార్కులకు డిఎస్సీ నియామకాల్లో 20% వెయిటేజ్ ఇస్తారు. టెట్ అర్హత మార్కుల్లో పురోగతి కోసం పలువురు పరీక్షలకు దరఖాస్తు చేస్తున్నారు. టెట్ పరీక్షల ఫీజు గతంలో రూ. 100 ఉండేది. దానిని గత టెట్‌ నిర్వహణలో రూ. 1000కి పెంచారు. దీనిపై అభ్య ర్థులు ఆందోళనలు వ్యక్తం చేసినా ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని సిఎం ప్రకటించారు.

కొద్ది నెలల క్రితం తెలంగాణలో 2.35 లక్షల మంది టెట్‌పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 1.10లక్షల మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. వీరికి కొత్త నోటిఫికేషన్‌లో ఫీజు మిన‍హాయింపు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత

Whats_app_banner