TG TET Results 2024 : రేపే తెలంగాణ టెట్ ఫలితాలు, డైరెక్ట్ లింక్ ఇదే
TG TET Results 2024 : తెలంగాణ టెట్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఫలితాలతో పాటు తుది కీని విడుదల చేయనున్నారు. టెట్ అధికారిక వెబ్ సైట్ https://tstet2024.aptonline.in/tstet/ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
TG TET Results 2024 : తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TG TET 2024 Results) ఫలితాలు రేపు(జూన్ 12) విడుదల కానున్నాయి. మే 20 నుంచి జూన్ 2 వరకు టెట్ పరీక్షలు జరగగా, జూన్ 3న ప్రాథమిక ఆన్సర్ కీ విడుదలైంది. బుధవారం తుది కీ విడుదల చేయనున్నారు. టెట్ పరీక్షలకు 2,86,381 దరఖాస్తులు చేసుకోగా, 2,36,487 మంది హాజరయ్యారు. రేపు టెట్ ఫలితాలు, తుది కీ విడుదల చేయనుంది విద్యాశాఖ. టెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://tstet2024.aptonline.in/tstet/ లో ఫలితాలు విడుదలయ్యాక చెక్ చేసుకోవచ్చు.
డీఎస్సీ నియామకాల్లో 20 శాతం వెయిటేజీ
రాష్ట్రంలో తొలిసారిగా టెట్ పరీక్షలను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించారు. మొత్తం 11 జిల్లా కేంద్రాల్లో టెట్ పరీక్షలు నిర్వహించారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. డీఎస్సీకి ముందు టెట్ పరీక్షను నిర్వహిస్తుంటారు. టెట్ పేపర్ -1కు 99,958 మంది దరఖాస్తు చేసుకోగా 86.03 శాతం మంది హాజరయ్యారు. పేపర్-2కి 1,86,423 మంది దరఖాస్తులు చేసుకోగా 82.58 శాతం మంది హాజరయ్యారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఉపాధ్యాయ ఉద్యోగాలకు టెట్ అర్హత పరీక్ష. అలాగే డీఎస్సీ నియామకాల్లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ కల్పిస్తారు. దీంతో బీఎడ్, డీఎడ్ అభ్యర్ధులు టెట్ పరీక్షలో అధిక స్కోర్ సాధించేందుకు పోటీపడుతుంటారు.
టీజీ టెట్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి?
- అభ్యర్థులు ముందుగా https://tstet2024.aptonline.in/tstet/ వెబ్ సైట్ లోకి వెళ్లండి.
- TG TET Results 2024 అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- మీ హాల్ టికెట్ నెంబర్ ను ఎంటర్ Get Results పై క్లిక్ చేయాలి.
- మీ స్కోర్ కార్డు స్క్రీన్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీని పొందవచ్చు.
- డీఎస్సీ ఉద్యోగ నియామక పరీక్షలో టెట్ స్కోర్ కీలకం.
- భవిష్యత్ అవసరాల దృష్ట్యా టెట్ స్కోర్ కార్డు కాపీ జాగ్రత్తగా ఉంచుకోవాలి.
మెగా డీఎస్సీ నోటిఫికేషన్
తెలంగాణ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 2629 స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీలు 6,508, భాషా పండితులు 727, పీఈటీలు 182, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్ ఎడ్యుకేషన్) 796 పోస్టులు ఉన్నాయి.
ఏపీ టెట్ ఫలితాలు
ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు మరో రెండు మూడు రోజుల్లో వెలువడనున్నాయి. ఇప్పటికే టెట్ రెస్పాన్స్ షీట్లు, ఫైనల్ కీ విడుదల అయ్యాయి. అయితే ఫలితాలు కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఏపీ టెట్-2024 నోటిఫికేషన్ ను ఫిబ్రవరి 7న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 18 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించింది. ఫిబ్రవరి 23 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఫిబ్రవరి 26న ప్రారంభమైన ఏపీ టెట్ పరీక్షలు మార్చి 9న ముగిశాయి. మార్చి 13నే టెట్ పరీక్షకు సంబంధించిన ఫైనల్ కీను రిలీజ్ చేయాల్సి ఉంది. అయితే మార్చి 14 రాత్రి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. వెబ్‌సైట్ https://aptet.apcfss.in/ నుంచి ఆన్సర్ కీ, రెస్సాన్స్ షీట్లను ఉంచింది. అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి వాటిని డౌన్‌లోడ్ చేసుకున్నారు. టెట్ పరీక్ష అర్హత సాధిస్తే డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ వస్తుంది. అనంతరం టెట్ ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది.
సంబంధిత కథనం