TG TET 2024 Registrations: తెలంగాణ టెట్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం, సైట్‌లో సాంకేతిక సమస్యలతో చిక్కులు
TG TET Registrations: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష రిజిస్ట్రేషన్లు ఎట్టకేలకు ప్రారంభం అయ్యాయి. రెండు రోజుల క్రితమే టెట్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కావాల్సి ఉన్నా సాంకేతిక కారణాలతో ఆలస్యమైంది. టెట్ ఫీజుల విషయంలో నెలకొన్న సందిగ్ధత నేపథ్యంలో గురువారం రాత్రి పొద్దుపోయాక సైట్ ఓపెన్ అయ్యింది.
TG TET Registration: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి. ఏడాదికి రెండు సార్లు టెట్ పరీక్షను నిర్వహించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ ఏడాదిలో రెండోసారి ఉపాధ్యాయ అర్హత పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేశార. నవంబర్ 5వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లను ప్రారంభిస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించినా పరీక్ష ఫీజు విషయంలో నెలకొన్న గందరగోళంతో రెండు రోజుల ఆలస్యమైంది.
చివరకు గురువారం రాత్రి సుమారు 11 గంటల నుంచి రిజిస్ట్రేషన్లను ప్రారంభించారు. మరోవైపు టెట్ 2024 సైట్‌ను సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. టెట్ పరీక్ష కోసం నిరుద్యోగ అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో గురువారం సైట్‌పై ఒత్తిడి పెరిగింది. సాంకేతిక కారణాల వల్ల పలువురికి సైట్ ఓపెన్ కాలేదు.
7వ తేదీ నుంచి టెట్ వెబ్‌సైట్ అందుబాటులోకి తెస్తామని,అభ్యర్థులు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.గురువారం ఉదయం నుంచి అభ్యర్థులు ఆన్లైన్ లింక్ కోసం ఎదురు చూవారు. రాత్రి పది గంటల తర్వాత టెట్ 2024-25 లింకుతో పాటు ఇన్ఫర్మేషన్ బులెటిన్ వెబ్సైట్‌లో అందుబాటులో ఉంచారు.
గతంలో టెట్ ఫీజు విషయంలో అభ్యర్థుల నుంచి నిరసనలు వ్యక్తం అయ్యాయి. అయితే అప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో తర్వాత పరీక్షకు తగ్గిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థులకు హామీ ఇచ్చారు. మరోవైపు గతంలో ఉన్న టెట్ పరీక్ష ఫీజును గత నోటిఫికేషన్ సమయంలో భారీగా పెంచారు. దీనిపై కూడా అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
అభ్యర్థుల నుంచి వచ్చిన డిమాండ్ నేపథ్యంలో టెట్ పరీక్ష ఫీజును ఈసారి తగ్గించారు. గతంలో ఇది ఒక పేపరుకు రూ.1000, రెండు పేపర్లకు రూ.2000గా ఫీజు ఉండేది. ప్రస్తుత నోటిఫికేషన్‌లో పరీక్ష ఫీజును రూ. 750, రూ. 1000 నిర్ణయించారు. గత మే నెలలో టెట్ రాసి అర్హత సాధించని వారు, ఒకవేళ సాధించినా స్కోర్ పెంచుకోవడానికి మరోసారి పరీక్ష రాసే వారికి ఎటువంటి ఫీజు ఉండదు. టెట్ 2024-25 ఫలితాలను ఫిబ్రవరి 5న ప్రకటిస్తారు. జనవరిలో పరీక్షలు నిర్వహిస్తారు.
నవంబర్ 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్ష దరఖాస్తులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. టెట్ విద్యార్హతలు, సెకండరీ గ్రేడ్, స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్టులు, అర్హతల వివరాలను మంగళవారం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 7వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. టెట్ 2024-25 నోటిఫికేషన్ కోసం ఈ లింకును అనుసరించండి.
జనవరిలో పరీక్షలు…
మరోవైపు తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆన్లైన్ పరీక్షలను జనవరి 1-20 తేదీల మధ్య నిర్వహిస్తారు. మార్చిలో ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలను నిర్వహించాల్సి ఉండటంతో జనవరిలోనే టెట్ పరీక్షలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. తెలంగాణలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెట్ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్‌ను కూడా గతంలోనే విడుదల చేసింది.
టెట్ పరీక్షల్లో రెండు పేపర్లు ఉంటాయిన నోటిఫికేషన్ విడుదలలో పేర్కొన్నారు. పేపర్-1కు డీఈడీ, పేపర్-2కు బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు. మొత్తం150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఓసీ అభ్యర్థులకు-90 మార్కులు, బీసీలకు 75, మిగిలిన వారికి 60 మార్కులు వస్తే టెట్ ఉత్తీర్ణులుగా గుర్తిస్తారు. రిజర్వేషన్ల ఆధారంగా నిర్దేశిత మార్కులు సాధించిన వారికి మాత్రమే డీఎస్సీ రాసేందుకు అవకాశం లభిస్తుంది.
ప్రాథమిక పాఠశాలల్లోని సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) ఉద్యోగాలకు అర్హత పొందేందుకు పేపర్-1లో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ఉన్నత పాఠశాలల్లోని స్కూల్ అసి స్టెంట్ ఉద్యోగాలకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. పేపర్-2లో గణితం, సైన్స్, సాంఘికశాస్త్రం రెండు వేర్వేరు పేపర్లు ఉంటాయి. టెట్ పరీక్షల్లో ఒకసారి పాసైతే ఆ స్కోర్కు జీవితకాలు గుర్తింపు ఉంటుంది. 2022 నుంచి ఈ మేరకు నిబంధనలు మార్చారు.
కొద్ది నెలల క్రితం తెలంగాణలో 2.35 లక్షల మంది టెట్‌పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 1.10లక్షల మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. వీరికి కొత్త నోటిఫికేషన్‌లో ఫీజు మినహాయింపు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత