TS TET Exam : టెట్ పరీక్ష నిర్వహణలో గందరగోళం, ఒక పేపర్ కు బదులు మరో పేపర్!-telangana tet 2023 exam invigilators changed papers candidates protested ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Tet 2023 Exam Invigilators Changed Papers Candidates Protested

TS TET Exam : టెట్ పరీక్ష నిర్వహణలో గందరగోళం, ఒక పేపర్ కు బదులు మరో పేపర్!

HT Telugu Desk HT Telugu
Sep 16, 2023 03:38 PM IST

TS TET Exam : రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం టెట్ అభ్యర్థులను అయోమయానికి గురిచేసింది. ఒక పేపర్ కు బదులుగా మరో పేపర్ అధికారులు ఇవ్వడంతో అభ్యర్థులు గందరగోళానికి గురైయ్యారు.

టెట్ అభ్యర్థులు ఆందోళన
టెట్ అభ్యర్థులు ఆందోళన

TS TET Exam : రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం టెట్ ఎగ్జామ్ రాస్తున్న అభ్యర్థుల పాలిట శాపంగా మారింది. ఎన్నో సంవత్సరాలుగా ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎంతో కష్టపడి చదివి పరీక్ష రాయడానికి వెళ్తే అధికారుల నిర్లక్ష్యంతో అక్కడి అభ్యర్థులు అయోమయానికి గురయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఒక పేపర్ కు బదులు మరో పేపర్ ఇవ్వడంతో ఈ గందరగోళం నెలకొందని గుర్తించిన అధికారులు పరీక్ష ప్రారంభమైన నలభై నిమిషాల తర్వాత తేరుకున్నారు. దీంతో విద్యార్థులు వైట్ నర్ వాడి, ఓఎంఆర్ షీట్ లో ఆన్సర్ లను మార్చుకోవచ్చని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

అధికారుల నిర్లక్ష్యం ఇలా?

సిరిసిల్ల పట్టణంలోని సుమారు పదిహేను సెంటర్లలో టెట్ పరీక్ష ప్రారంభమైన సుమారు నలభై నిమిషాల తర్వాత, గణితం, సైన్స్ పేపర్ కు బదులు ఎన్విరాన్మెంట్ పేపర్ ను అభ్యర్థులకు ఇన్విజిలేటర్లు అందచేశారు. అప్పటికే అభ్యర్థులు సమాధానాలను దిద్దేశారు. ఈ క్రమంలో సుమారు నలభైనిమిషాల తర్వాత తాము చేసిన తప్పును గుర్తించిన అధికారులు అభ్యర్థులకు తిరిగి గణితం,సైన్స్ పేపర్లు అందచేశారు. అయితే అప్పటికే ఇచ్చిన పేపర్ లోని ప్రశ్నలకు ఓఎంఆర్ షీట్ లో సమాధానాలు రాశారు అభ్యర్థులు. అయితే ఓఎమ్ఆర్ షీట్ లో రాసిన సమాధానాలను వైట్ నర్ తో చెరిపి మళ్లీ పూర్తిచేయాలని అధికారులు సూచించారు.

అభ్యర్థులు ఆందోళన చెందవద్దు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో టెట్ పరీక్ష 15 పరీక్షా కేంద్రాలలో జరిగాయని, అయితే మధ్యాహ్నం జరిగిన పరీక్షలో ఓ కేంద్రంలో ప్రశ్నాపత్రం ఆలస్యంగా ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎవరైతే ఓఎంఆర్ షీట్లో వైట్నర్ వాడారో వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ఓఎంఆర్ షీట్ వ్యాలిడ్ అవుతుందని, ఎలాంటి ఇబ్బంది లేదని ఉన్నతాధికారులతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి రమేష్ కుమార్ తెలిపారు.

అయోమయంలో అభ్యర్థులు

అధికారుల నిర్లక్ష్యంతో ఐదు గంటలకు ముగియాల్సిన ఎగ్జామ్ ఆరు గంటల వరకు పొడిగించగా తమ భవిష్యత్తు ఏమవుతోందని అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఎంతో కష్టపడి ప్రిపేర్ అయితే తప్పు పేపర్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని టెట్ అభ్యర్థులు కోరుతున్నారు.

రిపోర్టర్ : గోపికృష్ణ,కరీంనగర్

WhatsApp channel