TG TET 2024 II Notification : తెలంగాణ టెట్ 2 ముఖ్య సమాచారం - పరీక్ష తేదీలు, హాల్ టికెట్లు, ఫలితాల ప్రకటన వివరాలివే-telangana tet 2 notification 2024 important dates and details check here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Tet 2024 Ii Notification : తెలంగాణ టెట్ 2 ముఖ్య సమాచారం - పరీక్ష తేదీలు, హాల్ టికెట్లు, ఫలితాల ప్రకటన వివరాలివే

TG TET 2024 II Notification : తెలంగాణ టెట్ 2 ముఖ్య సమాచారం - పరీక్ష తేదీలు, హాల్ టికెట్లు, ఫలితాల ప్రకటన వివరాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 08, 2024 02:24 PM IST

TG TET 2024 II Notification Updates : టీజీ టెట్ వెబ్ సైట్ అందుబాటులోకి వచ్చింది. సాంకేతిక సమస్యలను పరిష్కరించటంతో అప్లికేషన్లు ప్రారంభమయ్యాయి. పూర్తిస్థాయి నోటిఫికేషన్ వివరాలను కూడా విద్యాశాఖ ప్రకటించింది. నవంబర్ 20వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. జనవరి 1, 2025 నుంచి ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి.

తెలంగాణ టెట్ 2 నోటిఫికేషన్ - 2024
తెలంగాణ టెట్ 2 నోటిఫికేషన్ - 2024

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌ 2024 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. నవంబర్ 7వ తేదీ రాత్రి తర్వాత టెట్ వెబ్ సైట్ అందుబాటులోకి వచ్చింది. సాంకేతిక సమస్యలను పరిష్కరించటంతో దరఖాస్తులను కూడా స్వీకరిస్తున్నారు.

మరోవైపు టెట్ - 2 నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను విద్యాశాఖ వెల్లడించింది. దరఖాస్తుల స్వీకరణ గడువు, హాల్ టికెట్లు విడుదల, పరీక్షల ప్రారంభంతో పాటు ఫలితాల విడుదల తేదీలను కూడా ప్రకటించింది. టెట్ - 2 పరీక్షల సిలబస్ ను https://schooledu.telangana.gov.in/ వెబ్ సైట్ నుంచి పొందవచ్చని పేర్కొంది.

తెలంగాణ టెట్ 2024 II నోటిఫికేషన్ - ముఖ్య తేదీలు:

  • తెలంగాణ టెట్ - 2 నోటిఫికేషన్ 2024 దరఖాస్తులు ప్రారంభం - నవంబర్ 07, 2024
  • దరఖాస్తులకు తుది గడువు - నవంబర్ 20, 2024.
  • టెట్ దరఖాస్తుల వెబ్ సైట్ - https://tgtet2024.aptonline.in/tgtet/
  • హాల్ టికెట్ల జారీ - 26 డిసెంబర్ 2024
  • టెట్ పరీక్షలు - జనవరి 1, 2025వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. జనవరి 20, 2025తో ముగుస్తాయి.
  • పరీక్ష సమయం - మొదటి సెషన్: 9.00 AM to 11.30 AM, రెండో సెషన్ : 2.00 PM to 4.30 PM
  • టెట్ ఫలితాలు - 05 ఫిబ్రవరి 2025.

తెలంగాణ టెట్ దరఖాస్తు విధానం:

  • టెట్ రాసే అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా https://tgtet2024.aptonline.in/tgtet/# వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • ముందుగా ‘Fee Payment’ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి నిర్ణయించిన ఫీజును చెల్లించాలి.
  • పేమెంట్ స్టెటస్ అనే కాలమ్ పై నొక్కి దరఖాస్తు రుసుం చెల్లింపు ప్రక్రియ పూర్తి అయిందా..? లేదా అనేది చెక్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత ‘Application Submission’ అనే లింక్ పై క్లిక్ చేయాలి.
  • మీ వివరాలను నమోదు చేయాలి. ఫొటో, సంతకం తప్పనిసరిగా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
  • అన్ని వివరాలను ఎంట్రీ చేశాక చివర్లో ఉండే సబ్మిట్ బటన్ పై నొక్కితే అప్లికేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.
  • 'Print Application' అనే ఆప్షన్ పై నొక్కితే మీ దరఖాస్తు కాపీనీ డౌన్లోడ్ లేదా ప్రింట్ తీసుకోవచ్చు.
  • రిజిస్ట్రేషన్ నెంబర్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి. హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు ఈ నెంబర్ ఉపయోగపడుతుంది.

తెలంగాణ టెట్ పేపర్- 1కు డీఈడీ, పేపర్-2కు బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులవుతారు. సెకండరీ గ్రేడ్‌ టీచర్లుగా ఉన్న వారు స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందేం దుకు టెట్ అర్హత ఉండాలని చెబుతుండటంతో ఇన్ సర్వీస్ టీచర్లు కూడా పెద్ద సంఖ్యలో టెట్ పరీక్షలకు హాజరుకానున్నారు. ఉపాధ్యాయ నియమాకాలకు టెట్ పరీక్షను అమలు చేస్తున్నప్పటి నుంచి ఇప్పటివరకు తొమ్మిది సార్లు ఈ పరీక్షలు నిర్వహించారు. వచ్చే జనవరిలో పదోసారి టెట్ జరగనుంది. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రెండోసారి టెట్‌ను నిర్వహిస్తుండటం విశేషం.

టెట్‌ పరీక్షల్లో రెండు పేపర్లు ఉంటాయి. మొత్తం150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఓసీ అభ్యర్థులకు-90 మార్కులు, బీసీలకు 75, మిగిలిన వారికి 60 మార్కులు వస్తే టెట్‌ ఉత్తీర్ణులుగా గుర్తిస్తారు. రిజర్వేషన్ల ఆధారంగా నిర్దేశిత మార్కులు సాధించిన వారికి మాత్రమే డీఎస్సీ రాసేందుకు అవకాశం లభిస్తుంది. టెట్‌ పరీక్షల్లో వచ్చిన మార్కులకు డిఎస్సీ నియామకాల్లో 20 శాతం వెయిటేజ్ ఉంటుంది. డీఎస్సీ నియాకంలో టెట్ స్కోర్ అత్యంక కీలకం.

Whats_app_banner

సంబంధిత కథనం