TS TET 2023 Results: సెప్టెంబర్ 27న ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు విడుదల
TS TET 2023 Results: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలను సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. డిఎస్సీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడంతో టెట్ ఫలితాల కోసం అభ్యర్థులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
TS TET 2023 Results: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్షఫలితాలు ఈ నెల 27న వెలువడనున్నాయి. సెప్టెంబర్ 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్ష జరిగింది. టెట్ పేపర్-1 పరీక్షకు 2.26 లక్షల మంది అభ్యర్థులు, పేపర్-2కు 1.90 లక్షల మంది హాజరయ్యారు. జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కావడంతో ఈ నెల 27న ఫలితాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, ఉన్నతాధికారుల అమోదం మేరకు ఫలితాల విడుదలపై నిర్ణయం తీసుకుంటారని ఎస్‌సీఈఆర్‌టీ ప్రకటించింది.
ట్రెండింగ్ వార్తలు
సెప్టెంబర్ 15న టెట్ పేపర్1, పేపర్2 పరీక్షలను నిర్వహించారు. తుది ఫలితాలను సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నట్లు ముందే ప్రకటించారు. సెప్టెంబర్ 15న నిర్వహించే టెట్ పేపర్ 1 పరీక్షను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, పేపర్ -2 ను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించి మొత్తం 2,83,620 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో పేపర్-1 కు 80,990.. పేపర్-2కు 20,370 అప్లికేషన్లు వచ్చినట్లు తెలిపారు. మొత్తం రెండు పేపర్లకు కలిపి 1,82,260 దరఖాస్తులు వచ్చాయని ప్రకటించారు.
సీటీఈటీ ఫలితాలు విడుదల
ఆగస్టు 20న నిర్వహించిన కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సీటీఈటీ) ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఫలితాల కోసం వెబ్‌సైట్ https://ctet.nic.in ను సంప్రదించవచ్చని సీబీఎస్‌ఈ సూచించింది.
ఎంబీబీఎస్ చివరి విడత కౌన్సెలింగ్
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో మూడు విడతల కౌన్సెలింగ్ ఇప్పటికే పూర్తైంది. కౌన్సిలింగ్ తర్వాత మిగిలిన కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి మంగళవారం సాయంత్రం 4 గంటల్లోపు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని కాళోజీ వర్సిటీ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలోని వివిధ మెడికల్ కాలేజీల్లో అందుబాటులో ఉన్న ఖాళీలు, ఫీజుల వివరాలను www.knruhs.telangana.gov వెబ్‌సైట్లో పరిశీలించాలని పేర్కొన్నారు.