TS TET Live Updates 2023: తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల - లింక్ ఇదే-telangana teacher eligibility test results live news updates 2023 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Tet Live Updates 2023: తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల - లింక్ ఇదే

తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల

TS TET Live Updates 2023: తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల - లింక్ ఇదే

Updated Sep 27, 2023 03:09 PM ISTUpdated Sep 27, 2023 03:09 PM IST
  • Share on Facebook
Updated Sep 27, 2023 03:09 PM IST
  • Share on Facebook

  • TS TET Live Updates 2023:తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు బుధవారం ఉదయం విడుదలయ్యాయి. షెడ్యూల్‌ ప్రకారమే ఫలితాలను విడుదల చేసింది తెలంగాణ పాఠశాల విద్యాశాఖ. https://tstet2023results.cgg.gov.in లింక్ తో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.

Wed, 27 Sep 202309:39 AM IST

క్వాలిఫై అయిన వారి శాతం….

తెలంగాణ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. పేపర్ -1లో 36.89 శాతం మంది అభ్యర్థులు క్వాలిఫై కాగా… పేపర్ -2లో 15.30 శాతం క్వాలిఫై అయ్యారు.

Wed, 27 Sep 202305:14 AM IST

కాలపరిమితి…

తెలంగాణ టెట్‌ అర్హత కాలపరిమితి జీవితకాలం ఉంటుంది. టెట్‌ పేపర్ -1లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ పోస్టులకు అర్హులవుతారు. పేపర్‌ 2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హత పొందుతారు. తెలంగాణలో ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. నవంబరు 20 నుంచి 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్ష జరగనుంది. జిల్లాల వారీగా ఖాళీలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది.

Wed, 27 Sep 202304:59 AM IST

అర్హులే…

ఈ టెట్ లో అర్హత సాధించిన వారు కూడా..టీఆర్టీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది.

Wed, 27 Sep 202304:32 AM IST

ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి:

టెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు మొదటగా https://tstet.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లండి.

TS TET Results 2023 అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

మీ హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేసి… Get Results పై క్లిక్ చేయండి.

మీ స్కోర్ కార్డు ఇక్కడ డిస్ ప్లే అవుతుంది.

ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీని పొందవచ్చు.

ఉద్యోగ నియామక పరీక్షలో టెట్ స్కోర్ కీలకం.

భవిష్యత్ అవసరాల దృష్ట్యా టెట్ స్కోర్ కార్డు కాపీ జాగ్రత్తగా ఉంచుకోవాలి.

Wed, 27 Sep 202304:31 AM IST

లింక్

https://tstet2023results.cgg.gov.in లింక్ తో టెట్ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు,

Wed, 27 Sep 202304:30 AM IST

హాజరైన అభ్యర్థులు

సెప్టెంబర్‌ 15వ తేదీన టెట్‌ పరీక్ష నిర్వహించగా… పేపర్‌-1కు 2.26 లక్షల మంది, పేపర్‌-2కు 1.90 లక్షల మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే.

Wed, 27 Sep 202304:29 AM IST

టెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి.

Wed, 27 Sep 202304:02 AM IST

టెట్ ఫలితాలు తెలుసుకోండి ఇలా

టెట్‌ పరీక్ష ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. http://tstet.cgg.gov.in/ ద్వారా పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ఫలితాలను తెలుసుకోవచ్చు.

Wed, 27 Sep 202302:57 AM IST

భారీగా హాజరైన అభ్యర్థులు

తెలంగాణ టెట్‌ పరీక్షకు సంబంధించి మొత్తం 2,83,620 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో పేపర్-1 కు 80,990.. పేపర్-2కు 20,370 అప్లికేషన్లు వచ్చినట్లు తెలిపారు. మొత్తం రెండు పేపర్లకు కలిపి 1,82,260 దరఖాస్తులు వచ్చాయని ప్రకటించారు.

Wed, 27 Sep 202302:57 AM IST

సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష

తెలంగాణలో సెప్టెంబర్‌ 15న టెట్‌ పేపర్‌1, పేపర్‌2 పరీక్షలను నిర్వహించారు. తుది ఫలితాలను సెప్టెంబర్‌ 27న విడుదల చేయనున్నట్లు ముందే ప్రకటించారు. సెప్టెంబర్ 15న నిర్వహించే టెట్ పేపర్ 1 పరీక్షను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, పేపర్ -2 ను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహించారు.

Wed, 27 Sep 202302:56 AM IST

తెలంగాణలో ఇప్పటికే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. నవంబరు 20 నుంచి 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్ష జరగనుంది. జిల్లాల వారీగా ఖాళీలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. డిఎస్సీ నియామకాలకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి కానుంది.

Wed, 27 Sep 202302:55 AM IST

టెట్‌కు జీవితకాలం వ్యాలిడిటీ

తెలంగాణ టెట్‌ అర్హత కాలపరిమితి జీవితకాలం ఉంటుంది. ఒకసారి ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. టెట్‌ పేపర్ -1లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ పోస్టులకు అర్హులవుతారు. పేపర్‌ 2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హత పొందుతారు.

Wed, 27 Sep 202302:55 AM IST

వెబ్‌సైట్‌లో ఫలితాలు

టెట్‌ ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌ https://tstet.cgg.gov.in/ లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ నెల 15న టెట్‌ పరీక్ష నిర్వహించగా పేపర్‌-1కు 2.26 లక్షలు, పేపర్‌-2కు 1.90 లక్షల మంది హాజరయ్యారు. ఇప్పటికే టెట్‌ ప్రాథమిక కీ విడుదల చేశారు.

Wed, 27 Sep 202302:54 AM IST

టెట్ ఫలితాలు మరికాసేపట్లో విడుదల

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. సెప్టెంబర్ 27వ తేదీ బుధవారం ఉదయం 10గంటలకు ఈ ఫలితాలను విడుదల చేయనున్నట్టు టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి వెల్లడించారు.