America Telugu Student Died : అమెరికాలో రోడ్డు ప్రమాదం, తెలంగాణ యువతి మృతి
America Telugu Student Died : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువతి మృతి చెందింది. యాదగిరిగుట్టకు చెందిన గుంటిపల్లి సౌమ్య ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం మరణించింది.
America Telugu Student Died : పై చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు యువతి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. తెలంగాణలోని యాదగిరిగుట్ట సమీపంలోని యాదగిరిపల్లికు చెందిన గుంటిపల్లి సౌమ్య(25) ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. అక్కడి అట్లాంటిక్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తుంది. ఆదివారం రాత్రి న్యూయర్క్ లో సౌమ్య రోడ్డు ప్రమాదానికి గురైంది.
అమెరికాలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సౌమ్య మృతి చెందింది. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న సౌమ్యను అతివేగంతో వచ్చిన కారు ఢీకొట్టడడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. సౌమ్య చదువుతో పాటు పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నట్లు ఆమె తల్లిదండ్రులు తెలిపారు. ఉన్నత చదువులు చదివి పై స్థాయికి వెళ్తుందని ఆశించిన కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని సౌమ్య తల్లిదండ్రులు కోటేశ్వరరావు, బాలమణి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సౌమ్య మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు కటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషయంలో నెలకొంది.
అమెరికాలో ఏపీ విద్యార్థి మృతి
అమెరికాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ విద్యార్థి మృతి చెందాడు. న్యూయార్క్ లో జరిగిన బైక్ ప్రమాదంలో ఏపీ విద్యార్థి మృతి చెందినట్టు రాయబార వర్గాలు ప్రకటించారు. న్యూయార్క్ లోని భారత కాన్సులేట్ జనరల్ ట్విట్టర్ పోస్టులో న్యూయార్క్ సబ్‌అర్బన్‌లో జరిగిన ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థి బెలెమ్ అచ్యుత్ బుధవారం సాయంత్రం బైక్ ప్రమాదానికి గురై మరణించినట్లు ప్రకటించారు. విద్యార్థి మృతికి సంతాపం తెలియజేశారు. అచ్యుత్ మరణంపై విచారం వ్యక్తం చేస్తూ అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ట్వీట్ చేశారు.
అచ్యుత్ మృతదేహాన్ని భారత్ కు పంపించడానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు బాధిత కుటుంబంతో పాటు, స్థానిక సంస్థలతో న్యూయార్క్‌లోని భారత రాయబార వర్గాలు సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించారు. అమెరికాలోని న్యూయార్క్‌లో గత బుధవారం జరిగిన బైక్ ప్రమాదంలో ఏపీకి చెందిన విద్యార్థి అచ్యుత్ మృతి చెందినట్లు కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా గురువారం ట్వీట్ చేసింది. బెలెం అచ్యుత్ న్యూయార్క్ స్టేట్ యూనివర్శిటీలో విద్యార్థిగా ఉన్నాడు. మరణించిన విద్యార్థి కుటుంబానికి న్యూయార్క్ లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సంతాపం తెలిపింది, అతని కుటుంబ సభ్యులతో తాము టచ్ లో ఉన్నామని, స్థానిక ఏజెన్సీలు కూడా అన్ని సహాయ సహకారాలు అందించాలని కోరారు.
సంబంధిత కథనం