Student Killed In US : అమెరికాలో తెలంగాణ విద్యార్ధిపై కాల్పులు….హత్యగా అనుమానం
Student Killed In US అమెరికాలో తెలంగాణకు చెందిన విద్యార్ధి కాల్పుల్లో మృతి చెందాడు. ప్రమాదవశాత్తూ గన్ ఫైరింగ్ జరిగిందని చెబుతున్నా ఈ విషయంలో స్పష్టత కొరవడింది. విద్యార్ధి మృతికి కారణమైన మరో తెలుగు యువకుడిని అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఆస్పత్రికి తీసుకువెళ్లే సరికి యువకుడు మృతి చెందాడు.
Student Killed In US తుపాకీ కాల్పులల్లో తెలంగాణలోని మధిరకు చెందిన యువకుడు అమెరికాలో ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లిన ఖమ్మం జిల్లా మధిరకు చెందిన మహంకాళి అఖిల్ సాయి అనే విద్యార్ధి ఆదివారం సాయంత్రం తుపాకీ కాల్పుల్లో గాయపడినట్లు ఆస్పత్రి వర్గాలకు సమాచారం వచ్చింది.

ఈ ఘటనలో రవితేజ గోలి అనే యువకుడిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని మాంట్‌గోమేరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడు అఖిల్ సాయి 13 నెలల కిందట అమెరికాలోని అలబామ పట్టణంలోని ఆబన్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చదువు కునేందుకు వెళ్లారు. చదువుకుంటూనే అక్కడ పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం రాత్రి 9.30 సమయంలో తలకు బుల్లెట్ గాయాలతో చావుబతుకుల్లో ఉన్న అఖిల్‌సాయిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
ఆస్పత్రికి తరలించే సమయానికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, హత్య ఆరోపణలతో అదే ప్రాంతంలో నివసిస్తున్న గోలి రవితేజను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రవితేజ అలబామా రాజధాని మోంటెగోమరి జైలులో ఉన్నాడు. దీనికి సంబంధించి ఇతర వివరాలను అక్కడి అధికారులు వెల్లడించలేదు. ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా, ఉద్దేశపూర్వకంగా చేసిన దాడా అనేది స్పష్టత రాలేదు.
మరోవైపు అఖిల్‌సాయి తల్లిదండ్రులు ఉమాశంకర్, మాధవి దంపతులు కొద్ది సంవత్సరాలుగా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం మధిరలో ఉంటున్న దంపతులు కుమారుడి మృతి వార్తతో హృదయ విదారకంగా రోదిస్తున్నారు. ఉన్నత చదువులకు అమెరికా వెళ్లిన తమ కుమారుడు ఈ స్థితిలో దేశానికి తిరిగి వస్తాడని ఊహించలేదని కన్నీటిపర్యంతమయ్యారు. అఖిల్‌సాయి మృతదేహాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
టాపిక్