TG student with Modi : తెలంగాణ విద్యార్థినికి అరుదైన అవకాశం.. ప్రధాని మోదీతో ముఖాముఖి-telangana student face to face with prime minister modi ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Student With Modi : తెలంగాణ విద్యార్థినికి అరుదైన అవకాశం.. ప్రధాని మోదీతో ముఖాముఖి

TG student with Modi : తెలంగాణ విద్యార్థినికి అరుదైన అవకాశం.. ప్రధాని మోదీతో ముఖాముఖి

Basani Shiva Kumar HT Telugu
Jan 16, 2025 04:49 PM IST

TG student with Modi : తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థినికి అరుదైన అవకాశం వచ్చింది. నల్గొండ జిల్లాకు చెందిన స్టూడెంట్ పీఎం మోదీతో ముఖాముఖిగా మాట్లాడారు. ప్రధానితో సంభాషించే అవకాశం ఇచ్చినందుకు విద్యార్థిని ఆనందం వ్యక్తం చేశారు. పరీక్షలపై మోదీతో చర్చించినట్టు చెప్పారు.

తెలంగాణ విద్యార్థినికి అరుదైన అవకాశం
తెలంగాణ విద్యార్థినికి అరుదైన అవకాశం (X)

తెలంగాణలోని నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలానికి చెందిన విద్యార్థిని అంజలి.. ఇటీవల ఢిల్లీలో జరిగిన ‘పరీక్ష పే చర్చ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడారు. ఈ కార్యక్రమం విద్యార్థులలో పరీక్ష సంబంధిత ఒత్తిడిని తగ్గించడం, వారి విద్యా ప్రయాణాలకు సహాయక వాతావరణాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

yearly horoscope entry point

అంజలి ఎంపిక..

ప్రస్తుతం మోడల్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న అంజలికి, ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీని కలిసే ఛాన్స్, ఆయనతో సంభాషించే అవకాశం లభించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అంజలిని ఎంపిక చేసింది. అంజలి 8వ తరగతి నుండి మోడల్ స్కూల్‌లో చందువుకుంటున్నారు.

మోదీ సమాధానాలు..

అంజలి ప్రధాని మోదీని కలవడంపై ఆ పాఠశాల ప్రిన్సిపాల్ రాగిణి, ఆమె గైడ్ టీచర్ సీత హర్షం వ్యక్తం చేశారు. అంజలి సాధించిన విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇంత గౌరవప్రదమైన కార్యక్రమంలో తమ పాఠశాలకు చెందిన విద్యార్థిని ప్రాతినిధ్యం వహించినందుకు అంజలిని అభినందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీని విద్యార్థులు పలు ప్రశ్నలు అడిగారు. వాటికి ప్రధానమంత్రి సమాధానమిచ్చారు. పరీక్షలను విశ్వాసంతో ఎలా ఎదుర్కోవాలో చిట్కాలు చెప్పారు.

ప్రశ్నా- సమాధానం సెషన్..

బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడతారు. ఈ పరీక్షా పే చర్చాలో ప్రశ్నా- సమాధానం సెషన్ ఉంటుంది. ఇందులో పరీక్షల ఒత్తిడి, ఇతర సమస్యలకు సంబంధించిన విషయాలను చర్చిస్తారు. పరీక్షల ఒత్తిడిని తగ్గించడానికి, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు జీవితాన్ని 'ఉత్సవ్'గా జరుపుకునేలా ప్రోత్సహించడానికి ఈ పీపీసీ ని ప్రారంభించారు.

గత ఏడేళ్లుగా..

ఈ కార్యక్రమం గత ఏడేళ్లుగా అద్భుతమైన విజయాన్ని సాధించిందని విద్యా మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక ప్రకటనలో తెలిపింది. స్వదేశీ గేమ్ సెషన్లు, మారథాన్ రన్లు, మీమ్ పోటీలు, నుక్కడ్-నాటకాలు, యోగా-కమ్-మెడిటేషన్ సెషన్లు; సీబీఎస్ఈ, కేవీఎస్, ఎన్వీఎస్‌ల గాన ప్రదర్శనలు, పోస్టర్ తయారీ పోటీలు, మానసిక ఆరోగ్య కౌన్సెలింగ్, ప్రత్యేక అతిథులతో వర్క్ షాప్‌లు, స్ఫూర్తిదాయకమైన సినిమా సిరీస్‌ల ప్రదర్శనలు ఇందులో ఉంటాయి.

Whats_app_banner