TS SI Constable Results : తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ తుది రాత పరీక్ష ఫలితాలు విడుదల-telangana state police recruitment si constable results released omr sheets in website ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Telangana State Police Recruitment Si Constable Results Released Omr Sheets In Website

TS SI Constable Results : తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ తుది రాత పరీక్ష ఫలితాలు విడుదల

టీఎస్ ఎస్సై, కానిస్టేబుల్ ఫలితాలు
టీఎస్ ఎస్సై, కానిస్టేబుల్ ఫలితాలు (Image Credit : Unsplash )

TS SI Constable Results :తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ తుది రాతపరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. అభ్యర్థుల ఓఎమ్ఆర్ షీట్లను https://www.tslprb.in/ అందుబాటులో ఉంచనున్నారు.

TS SI Constable Results :తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ తుది రాత పరీక్షలు ఫలితాలు విడుదల అయ్యాయి. సివిల్, ట్రాన్స్ పోర్ట్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు మొత్తం 98,218 మంది ఎంపికయ్యారు. ఐటీ, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పోస్టులకు 4564 మంది సెలెక్ట్ అయ్యారు. ఇక సివిల్ ఎస్సై పోస్టులకు 43,708 మంది ఎంపికయ్యారు. అభ్యర్థులు ఓఎమ్ఆర్ షీట్లను https://www.tslprb.in/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

తుది రాత ప‌రీక్షల్లో 84.06 శాతం మంది అర్హత

తెలంగాణ పోలీసు నియామకాలు మార్చి - ఏప్రిల్ మధ్య కాలంలో పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ తుది రాత ప‌రీక్షల్లో 84.06 శాతం మంది అర్హత సాధించిన‌ట్లు నియామక బోర్డు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పోస్టుల‌కు సంబంధించి తుది రాత ప‌రీక్ష రాసిన అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను వెబ్‌సైట్‌లో నేటి రాత్రి నుంచి అందుబాటులో ఉంచ‌నుంది. ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ సివిల్, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్, ప్రొహిబిష‌న్, ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు 98,218 (90.90 %), ఎస్‌సీటీ ఎస్ఐ సివిల్ పోస్టుల‌కు 43,708 (75.56 %), ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ ఐటీ అండ్ సీవో ఉద్యోగాల‌కు 4,564 (74.84 %), ఎస్‌సీటీ ఎస్ఐ ఐటీ అండ్ సీవో పోస్టుల‌కు 729 (23.40 %), ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ డ్రైవ‌ర్, డ్రైవ‌ర్ ఆప‌రేట‌ర్ ఉద్యోగాల‌కు 1,779 (89.53%), ఎస్‌సీటీ ఏఎస్ఐ ఎఫ్‌పీబీ ఉద్యోగాల‌కు 1,153 (77.54 %), ఎస్‌సీటీ ఎస్ఐ పీటీవో ఉద్యోగాల‌కు 463 (79.97 %), ఎస్‌సీటీ పీసీ మెకానిక్ పోస్టుల‌కు 238 (82.07 %) మంది అర్హత సాధించారని పోలీస్ నియామక బోర్డు తెలిపింది.

జూన్ రెండో వారంలో మెరిట్ జాబితా

తెలంగాణ పోలీస్ నియామకాల మొత్తం అన్ని ఉద్యోగాలకు సంబంధించి 84 శాతం మంది అర్హత సాధించినట్లు బోర్డు తెలిపింది. అభ్యర్థుల పర్సనల్ లాగిన్ లో ఓఎంఆర్ షీట్లను మంగళవారం రాత్రి అప్ లోడ్ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. దీంతో పాటు అభ్యర్థి ఫలితాలు కూడా విడుదల చేయనున్నారు. అభ్యర్థుల పర్సనల్ లాగిన్ ద్వారా ఈ వివరాలను తెలుసుకోవచ్చు. అయితే మెరిట్ జాబితా విడుదలపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. జూన్ రెండో వారంలో మెరిట్ జాబితా విడుదల చేయనున్నట్లు సమాచారం. అభ్యర్థులకు ఏమైనా ఓఎంఆర్ పత్రాల్లో కరెక్షన్స్ కు సంబంధించి అభ్యంతరాలు ఉంటే తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చని నియామక బోర్డు తెలిపింది. ఇందుకోసం రూ.3000 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే రూ.2 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ అవకాశం జూన్ 1 నుంచి జూన్ 3 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. వీటితో పాటు దరఖాస్తుల ఎడిట్ కు అవకాశం కల్పించనున్నారు. దరఖాస్తుల్లో తప్పులను సరిచేసుకోవడానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో అవకాశం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.