TS Staff Nurse Recruitment: తెలంగాణ స్టాఫ్ నర్స్ నియామక పరీక్ష ఫలితాలు విడుదల
TS Staff Nurse Recruitment: తెలంగాణలో స్టాఫ్ నర్స్ నియామకాల కోసం నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను మంత్రి దామోదర రాజనరసింహ విడుదల చేశారు.
TS Staff Nurse Recruitment: తెలంగాణలో స్టాఫ్ నర్సు ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్ష ఫలి తాలు విడుదల చేశారు. స్టాఫ్ నర్స్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు హాజరైన అభ్యర్థుల మార్కులను వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్ మెంట్ బోర్డు విడుదల చేసింది.
తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో 7,094 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి గతే డాది డిసెంబరు 30న ప్రకటన వెలువడింది. ఈ పోస్టుల భర్తీకి గత ఆగస్టులో రాతపరీక్ష నిర్వహించారు. పరీక్షకు రాష్ట్రవ్యా ప్తంగా 40,936 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
రాత పరీక్షలో వచ్చిన మార్కులపై అభ్యంతరాలుంటే అభ్యర్థులు ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5.30 గంటలలోపు తెలియజేయాలని మంత్రి దామోదర సూచించారు. అభ్యంతరాల పరిశీలించిన తర్వాత మెరిట్ జాబితా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ వైద్య సేవలో అనుభవం ఉన్నవారికి ప్రత్యేక పాయింటు కేటాయించారు.
మార్కులతో పాటు రిజర్వేషన్ల వివరా లను అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్ ఐడీల్లో అందుబాటులో ఉంచారు. రాత పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 40,936 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మెరిట్ లిస్ట్ విడుదలైన తర్వాత నియామక ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఒక్కో పోస్టుకు ఐదుగురు పోటీ పడుతున్నారు.