TS SSC Supplementary : పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల-telangana ssc supplementary exams from june 14 to 22th time table out ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Ssc Supplementary Exams From June 14 To 22th Time Table Out

TS SSC Supplementary : పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల

Bandaru Satyaprasad HT Telugu
May 17, 2023 06:37 PM IST

TS SSC Supplementary : తెలంగాణ ఎస్ఎస్సీ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ను బోర్డు ప్రకటించింది. జూన్ 14 నుంచి 22 వరకు పది సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

పదో తరగతి సప్లిమెంటరీ షెడ్యూల్
పదో తరగతి సప్లిమెంటరీ షెడ్యూల్ (HT )

TS SSC Supplementary : తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 14 నుంచి 22 వరకు ఎస్ఎస్సీ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతిరోజు ఉదయం గం.9.30ల నుంచి మధ్యాహ్నం గం 12.30ల వరకు పరీక్షలు జరగనున్నాయి. కాంపొజిట్ పేపర్లకు మాత్రం మధ్యాహ్నం 12.50 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి 13 వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా... 86.6 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

ట్రెండింగ్ వార్తలు

పది పరీక్షల షెడ్యూల్

  • 14-06-2023 : ఫస్ట్ లాంగ్వేజ్ (Group-A), ఫస్ట్ లాంగ్వేజ్ Part -I (కంపోజిట్ కోర్సు), ఫస్ట్ లాంగ్వేజ్ (Part-II కంపోజిట్ కోర్సు).
  • 15-06-2023 : సెకండ్‌ లాంగ్వేజ్
  • 16-06-2023 : థర్డ్‌ లాంగ్వేజ్‌ (English)
  • 17-06-2023 : మ్యాథమెటిక్స్‌
  • 19-06-2023 : సైన్స్ (పార్ట్-1, ఫిజికల్ సైన్స్, పార్ట్-2, బయాలాజికల్ సైన్స్)
  • 20-06-2023 : సోషల్ స్టడీస్
  • 21-06-2023 : OSSC మెయిన్‌ లాంగ్వేజ్ పేపర్-1 (Sanskrit,Arabic)
  • 22-06-2023 : OSSC మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్-2 (Sanskrit,Arabic)

తెలంగాణ పదో తరగతి ఫలితాలను ఇటీవల మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో బాలికలు 88.53 శాతం, బాలురు 84.68 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 99 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్‌ జిల్లా టాప్ లో నిలిచింది. ఇక 59.46 శాతంతో వికారాబాద్‌ చివరి స్థానంలో ఉంది. 25 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా ఉత్తీర్ణత కాలేదు. ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం జూన్‌ 14 నుంచి 22వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు మే 26లోపు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప‌రీక్షలు జూన్ 22 వ‌ర‌కు కొన‌సాగుతాయి. అలాగే రీకౌంటింగ్‌కు కూడా అవకాశం కల్పించారు. ఇందుకోసం రూ. 500ల చొప్పున చెల్లించి మార్కులు మ‌ళ్లీ లెక్కించుకోవ‌చ్చు. ఫలితాలు విడుదలైన 15 రోజుల్లోనే ఎస్‌బీఐ బ్యాంకులో చ‌లాన్లు చెల్లిస్తే రీ కౌంటింగ్‌కు అవ‌కాశం ఇవ్వనున్నారు.

ఏప్రిల్‌ 3 నుంచి 13వ తేదీ వరకు తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది జరిగిన పరీక్షలకు రెగ్యుల‌ర్ విద్యార్థులు 4,86,194 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఇందులో 4,84,384 మంది హాజరయ్యారు. 1,809 మంది ప‌రీక్షలకు గైర్హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 2621 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి.

IPL_Entry_Point