TS SSC Exams 2023: ఏప్రిల్ 3 నుంచి టెన్త్ పరీక్షలు… ఈ సారి 6 పేపర్లే
Telangana SSC Exams: పదో తరగతి పరీక్ష తేదీలు వచ్చేశాయి. రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ వెల్లడించింది.
Telangana SSC Exams Schedule 2023:పదో తరగతి విద్యార్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది తెలంగాణ విద్యాశాఖ. రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు 11 పేపర్లతో పది పరీక్షలు నిర్వహిస్తుండగా.. 6 పేపర్లకు కుదించినట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది.
ఇక ఈ అకాడమిక్ పరీక్షలు వంద శాతం సిలబస్ తో జరగనున్నాయి. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ను మార్చి, ఫిబ్రవరి నెలల్లో నిర్వహినున్నారు. త్వరలోనే మోడల్ ప్రశ్నాపత్రాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచనున్నారు. ఈసారి 6 పేపర్లతోనే పరీక్షలు జరుగుతుండగా... ఇందులో రాత పరీక్షలకు 80 మార్కులు, ఫార్మటివ్ అసెస్మెంట్ కు 20 మార్కులు ఉంటాయి. అన్ని ఎగ్జామ్స్ కు 3 గంటలు, సైన్స్ కు మాత్రం 3.20 గంటల సమయం ఉంటుంది. ఈ మేరకు విద్యాశాఖ విడుదల చేసిన ప్రకటనలో పూర్తి వివరాలను వెల్లడించారు.
ఏప్రిల్ 3 - ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్
ఏప్రిల్ 4 - సెకండ్ లాంగ్వేజ్
ఏప్రిల్ 6 - థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)
ఏప్రిల్ 8 - గణితం
ఏప్రిల్ 10 - సైన్స్
ఏప్రిల్ 11 - సోషల్ స్టడీస్
TS Intermediate Exams Schedule : మరోవైపు ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ ఇంటర్ బోర్డు డిసెంబర్ 19న ప్రకటించింది. 2023, మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఇంటర్ మొదటి, రెండో సంవత్సర విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ఎగ్జామ్స్ విభాగం జాయింట్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారం.... జనరల్, ఒకేషనల్ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు 2023, ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2 వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. రెండు సెషన్లలో జరిగే ప్రాక్టికల్స్ ఆదివారం రోజు కూడా ఉంటాయి. ప్రాక్టికల్స్ ఉదయం సెషన్ 9 గంటల నుంచి 12 గంటల వరకు... రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి.
ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష మార్చి 4న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష మార్చి 6న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు జరుగుతుంది. థీయరీ పరీక్షలు.. మొదటి సంవత్సరం విద్యార్థులకు మార్చి 15న మొదలై.. ఏప్రిల్ 3న ముగుస్తాయి. రెండో సంవత్సర విద్యార్థులకు మార్చి 16న మొదలై.. ఏప్రిల్ 4న ముగుస్తాయి. థియరీ పరీక్షలన్నీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి.