TG SSC Exams 2024 : తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్... పబ్లిక్ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు
TG SSC Exams Fee 2025 : తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు మరో కీలక అప్డేట్ వచ్చేసింది. పబ్లిక్ పరీక్షల ఫీజు గడువును పొడిగించారు. ఎలాంటి ఫైన్ లేకుండా నవంబర్ 28 తేదీ వరకు వరకు ఫీజు చెల్లించుకునే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్ష విభాగం ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు గడువును పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్ష విభాగం ప్రకటన విడుదల చేసింది. ముందుస్తుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… నవంబర్ 18వ తేదీతో గడువు ముగిస్తుంది. అయితే ఈ తేదీని నవంబర్ 28వ తేదీ వరకు పొడిగించారు.
మరోవైపు నిర్దేశించిన గడువు దాటితే… రూ.50 ఆలస్య రుసుంతో డిసెంబర్ 2 వరకు ఫీజు చెల్లించుకోవచ్చు. రూ. 200 ఆలస్య రుసుంతో డిసెంబర్ 12 వరకు ఫీజు చెల్లించవచ్చు. ఇక రూ. 500 ఆలస్య రుసుంతో డిసెంబర్ 21 వరకు చెల్లించుకునే అవకాశం ఉంటుంది.
- రెగ్యూలర్ విద్యార్థులు అన్ని పేపర్లకు కలిపి రూ. 125 ఫీజు చెల్లించాలి.
- మూడు పేపర్ల లోపు ఉంటే రూ. 110గా చెల్లించాలి. మూడు పేపర్ల కంటే ఎక్కువ బ్యాక్ లాగ్స్ ఉన్న విద్యార్థులు రూ. 125 చెల్లించాలి.
- ఒకేషనల్ విద్యార్థులు అదనంగా రూ. 60 చెల్లించాలి.
- https://www.bse.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఆన్ లైన్ లో ఫీజు చెల్లింపు…
మరోవైపు ఫీజు చెల్లింపు ఇబ్బందులకు పరిష్కరించేలా ప్రభుత్వ పరీక్షల విభాగం చర్యలు చేపట్టింది. ఆన్ లైన్ లోనే పరీక్షల ఫీజును చెల్లించేలా ఆప్షన్ తీసుకొచ్చింది. పరీక్షల ఫీజు చెల్లించాలంటే విద్యార్ధులు చదివే పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఫీజు రుసుం కట్టాలి.
ప్రధానోపాధ్యాయుడు లేదా పాఠశాలల సిబ్బంది బ్యాంకుకు వెళ్లి చలానా తీసేవారు. ఇదంతా కూడా పని భారంగా మారిపోయింది. ఈ సమస్యలకు చెక్ పెట్టేలా వెబ్ సైట్ లో ఆన్ లైన్ పేమెంట్ ఆప్షన్ తీసుకొచ్చారు. ప్రాధానోపాధ్యాయులకు కేటాయించే వివరాల ద్వారా లాగిన్ అవుతారు. నేరుగా ఆన్ లైన్ లోనే ఫీజు చెల్లిస్తారు. ఫీజు చెల్లించిన 24 గంటల్లోపు స్టేటస్ అప్డేట్ అవుతుంది. https://bse.telangana.gov.in/SSCADMFRFY/Account/Login.aspx లింక్ పై క్లిక్ చేసి ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఫీజుల చెల్లింపుల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించేలా పరీక్షల విభాగం మరికొన్ని చర్యలను కూడా చేపట్టింది. జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించటంతో పాటు హెల్ప్ లైన్ నెంబర్లను కూడా తీసుకొచ్చింది.
సంబంధిత కథనం