TS SI Constable Final Key : తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ తుది రాత పరీక్ష ఫైనల్ కీ విడుదల-telangana si constable final exam key released by police recruitment board ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Telangana Si Constable Final Exam Key Released By Police Recruitment Board

TS SI Constable Final Key : తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ తుది రాత పరీక్ష ఫైనల్ కీ విడుదల

టీఎస్ ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలు
టీఎస్ ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలు

TS SI Constable Final Key : తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ తుది రాత పరీక్ష ఫైనల్ కీ ను నియామక మండలి విడుదల చేసింది.

TS SI Constable Final Key : తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల తుది రాత పరీక్ష ఫైనల్‌ కీ విడుదలైంది. తుది రాత పరీక్షలో అర్హత సాధించిన వారి వివరాలను ఇప్పటికే పోలీస్ నిమాయక మండలి ప్రకటించింది. కానిస్టేబుల్‌ సివిల్‌, ట్రాన్స్‌పోర్టు, ఎక్సైజ్‌ పోస్టులకు 98,218 మంది అర్హత సాధించినట్టు వెల్లడించింది. అభ్యర్థులకు రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు అవకాశం కల్పించిన బోర్డు జూన్‌ 1 నుంచి 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు

తుది రాత పరీక్షలు ఫలితాలు విడుదల

తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ తుది రాత పరీక్షలు ఫలితాలు విడుదల అయ్యాయి. సివిల్, ట్రాన్స్ పోర్ట్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు మొత్తం 98,218 మంది ఎంపికయ్యారు. ఐటీ, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పోస్టులకు 4564 మంది సెలెక్ట్ అయ్యారు. ఇక సివిల్ ఎస్సై పోస్టులకు 43,708 మంది ఎంపికయ్యారు. అభ్యర్థులు ఓఎమ్ఆర్ షీట్లను https://www.tslprb.in/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. తెలంగాణ పోలీసు నియామకాలు మార్చి - ఏప్రిల్ మధ్య కాలంలో పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ తుది రాత ప‌రీక్షల్లో 84.06 శాతం మంది అర్హత సాధించిన‌ట్లు నియామక బోర్డు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.

98,218 మంది అర్హత సాధించారు

ఈ పోస్టుల‌కు సంబంధించి తుది రాత ప‌రీక్ష రాసిన అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను వెబ్‌సైట్‌లో నేటి రాత్రి నుంచి అందుబాటులో ఉంచ‌నుంది. ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ సివిల్, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్, ప్రొహిబిష‌న్, ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు 98,218 (90.90 %), ఎస్‌సీటీ ఎస్ఐ సివిల్ పోస్టుల‌కు 43,708 (75.56 %), ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ ఐటీ అండ్ సీవో ఉద్యోగాల‌కు 4,564 (74.84 %), ఎస్‌సీటీ ఎస్ఐ ఐటీ అండ్ సీవో పోస్టుల‌కు 729 (23.40 %), ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ డ్రైవ‌ర్, డ్రైవ‌ర్ ఆప‌రేట‌ర్ ఉద్యోగాల‌కు 1,779 (89.53%), ఎస్‌సీటీ ఏఎస్ఐ ఎఫ్‌పీబీ ఉద్యోగాల‌కు 1,153 (77.54 %), ఎస్‌సీటీ ఎస్ఐ పీటీవో ఉద్యోగాల‌కు 463 (79.97 %), ఎస్‌సీటీ పీసీ మెకానిక్ పోస్టుల‌కు 238 (82.07 %) మంది అర్హత సాధించారని పోలీస్ నియామక బోర్డు తెలిపింది.

జూన్ రెండో వారంలో మెరిట్ జాబితా

తెలంగాణ పోలీస్ నియామకాల మొత్తం అన్ని ఉద్యోగాలకు సంబంధించి 84 శాతం మంది అర్హత సాధించినట్లు బోర్డు తెలిపింది. అభ్యర్థుల పర్సనల్ లాగిన్ లో ఓఎంఆర్ షీట్లను మంగళవారం రాత్రి అప్ లోడ్ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. దీంతో పాటు అభ్యర్థి ఫలితాలు కూడా విడుదల చేయనున్నారు. అభ్యర్థుల పర్సనల్ లాగిన్ ద్వారా ఈ వివరాలను తెలుసుకోవచ్చు. అయితే మెరిట్ జాబితా విడుదలపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. జూన్ రెండో వారంలో మెరిట్ జాబితా విడుదల చేయనున్నట్లు సమాచారం.

WhatsApp channel