TS Schools: 2022-23 అకడమిక్ క్యాలెండర్ విడుదల.. సెలవు దినాలు ఇవే….-telangana schools academic calendar 2022 23 released full details here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Schools Academic Calendar 2022-23 Released Full Details Here

TS Schools: 2022-23 అకడమిక్ క్యాలెండర్ విడుదల.. సెలవు దినాలు ఇవే….

HT Telugu Desk HT Telugu
Jun 29, 2022 08:08 PM IST

telangana schools academic calendar: తెలంగాణలోని పాఠశాలలకు సంబంధించి అకడమిక్ క్యాలెండ‌ర్‌ విడుదలైంది. పాఠశాలల పని దినాలు, సెలవు దినాల వివరాలను పేర్కొంది.

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల అకడమిక్ క్యాలెండర్,
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల అకడమిక్ క్యాలెండర్,

telangana schools academic calendar: 2022-23 విద్యా సంవ‌త్స‌రానికి సంబంధించిన‌ అకడమిక్ క్యాలెండ‌ర్‌ విడుదలైంది. ఈ మేరకు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేష‌న్ డిపార్ట్‌మెంట్ వివరాలను వెల్లడించింది. ఈ విద్యా సంవ‌త్స‌రంలో ఒక‌టి నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు మొత్తం 230 ప‌ని దినాలు ఉంటాయ‌ని పేర్కొంది. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 24వ తేదీ వ‌ర‌కు పాఠ‌శాల‌లు కొన‌సాగ‌నున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

ముఖ్య వివరాలు....

24-04-2023 స్కూల్ లాస్ట్ వర్కింగ్ డే.

230 రోజులు పాఠశాల పని దినాలు.

25-04-2023 నుంచి 11-6-2023 వరకు వేసవి సెలవులు.

9am నుంచి 4pm వరకు ప్రైమరీ స్కూల్.

9am నుంచి 4.15pm వరకు ప్రాథమికోన్నత పాఠశాల.

9.30am నుంచి 4.45pm వరకు ఉన్నత పాఠశాల క్లాస్ లు జరుగుతాయి.

సెప్టెంబరు 26 నుంచి అక్టొబర్ 10 వరకు దసరా సెలవులు(14 రోజులు).

జనవరి 13 నుంచి జనవరి 17 వరకు సంక్రాంతి సెలవులు(5 రోజులు).

క్రిస్మ‌స్ సెల‌వులు – డిసెంబ‌ర్ 22 నుంచి 28 వ‌ర‌కు(7 రోజులు).

రేపు పది ఫలితాలు….

telangana ssc results 2022: తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు రేపు(జూన్ 30న) విడుద‌ల కానున్నాయి. ఎస్ఎస్ సీ బోర్డు అధికారులు దీనికోసం ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఉదయం 11గంటలకు హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో పదో తరగతి ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేస్తారు. విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ www.bse.telangana.gov.in లేదా www.bseresults.telangana.gov.in లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

మే 23 నుంచి మే 25 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,861 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 5,09,275 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అయ్యారు. వీరిలో 2,58,098 మంది బాలురు, 2,51,177 మంది బాలికలు ఉన్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం, సిలబస్ వంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని పరీక్షల్లో మార్పులు చేసింది తెలంగాణ ఎస్ఎస్సీ బోర్డు. సిలబస్ ను 80 శాతం తగ్గించింది. ఈ మేరకు పరీక్షా పేపర్ లను 11 నుంచి 6 పేపర్లకు కుదించారు. ఫిజిక్స్, బయాలజీ పేపర్లకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించారు.

ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు జూన్‌ 1తో ముగియగా.. ఆ తర్వాతి.. రెండో రోజు జూన్‌ 2 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ మెుదలైంది. ఇక ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను జూన్‌ 30న ప్రకటించాలని విద్యాశాఖ ముమ్మరంగా కసరత్తు చేసి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల తర్వాత ఈ జరిగిన పదో తరగతి పరీక్షల ఫలితాలపై ఆసక్తి నెలకొంది.

IPL_Entry_Point

టాపిక్