TGSRTC Minister Ponnam : పండగ వేళ అదనపు ఛార్జీలు వసూలు చేస్తే బస్సులు సీజ్ - ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలకు హెచ్చరికలు-telangana rtc minister warns to private travel bus owners over sankranthi festival rush ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgsrtc Minister Ponnam : పండగ వేళ అదనపు ఛార్జీలు వసూలు చేస్తే బస్సులు సీజ్ - ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలకు హెచ్చరికలు

TGSRTC Minister Ponnam : పండగ వేళ అదనపు ఛార్జీలు వసూలు చేస్తే బస్సులు సీజ్ - ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలకు హెచ్చరికలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 10, 2025 03:56 PM IST

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలకు తెలంగాణ ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరికలు జారీ చేశారు. పండగ వేళ ప్రయాణికుల వద్ద అదనపు చార్జీలు వసూలు చేయవద్దన్నారు. అలా చేసే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తపవన్నారు.

తెలంగాణ ఆర్టీసీ
తెలంగాణ ఆర్టీసీ

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం 6432 ప్రత్యేక బస్సులు నడపాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు నేటి నుంచి నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులకు అవసరమైతే ఆర్టీసీ మరిన్ని బస్సులు నడపడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు.

yearly horoscope entry point

ఆర్టీసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. ప్రతి మేజర్ బస్ స్టేషన్ వద్ద ప్రత్యేక అధికారులు ప్రయాణికులకు ఇబ్బందులు కలవకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందన్నారు. అయితే బస్సుల్లో అదనంగా మహిళలు వచ్చ అవకాశం ఉందని… అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఎక్కడ ఇబ్బందులు కలిగించవద్దని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ప్రైవేట్ ట్రావెల్స్ కు హెచ్చరికలు…!

మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సంక్రాంతి పండగ పూట ప్రయాణికులను అదనపు చార్జీల పేరుతో దోపిడికి గురి చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న చార్జీలనే వసూలు చేయాలని అదనంగా వసూలు చేస్తే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.

ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు అదనంగా వసూలు చేస్తే ప్రయాణికులు రవాణా శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. అధికారులు ఫీల్డ్ లోనే ఉండాలని నిరంతరం తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడ ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే స్పందించాలన్నారు. అదనపు చార్జీలు వసూలు చేసినట్లు దృష్టికి వస్తే బస్సులు సీజ్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రయాణికుల భద్రత, సంక్షేమానికే ప్రాధానత్య కల్పిస్తుందని మంత్రి పొన్నం గుర్తు చేశారు. ప్రయాణికులు పండగ సమయంలో జాగ్రత్తగా గమ్య స్థానాలకు వెళ్లాలని సూచించారు.

ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు:

సంక్రాంతి వేళ 6432 ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్ఆర్టీసీ యాజ‌మాన్యం నిర్ణ‌యించింది.జనవరి 10, 11, 12 తేదిల్లో ప్ర‌యాణికుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంది. ఆయా రోజుల్లో ర‌ద్దీ మేర‌కు ప్ర‌త్యేక బ‌స్సుల‌ను అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేసింది. అలాగే ఈ నెల 19, 20 తేదిల్లో తిరుగు ప్ర‌యాణ ర‌ద్దీకి సంబంధించి త‌గిన ఏర్పాట్లు చేసింది.

హైదరాబాద్ లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్స్‌, ఆరాంఘర్‌, ఎల్బీనగర్‌ క్రాస్‌ రోడ్స్‌, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల సౌక‌ర్యార్థం పండల్స్, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేసింది.

ఈ నెల 10, 11, 12 తేదిల‌తో పాటు తిరుగు ప్ర‌యాణ ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే 19, 20 తేదిల్లో మాత్ర‌మే స‌వ‌రించిన ఛార్జీలు(50 శాతం) అమ‌ల్లో ఉంటాయని టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. స్పెష‌ల్ బ‌స్సులు మిన‌హా రెగ్యూల‌ర్ బ‌స్సుల్లో సాధార‌ణ చార్జీలే అమ‌ల్లో ఉంటాయని స్పష్టం చేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం