TS Power Demand : ఈరోజు విద్యుత్ గట్టిగా వాడేశారుగా.. ఇంతలా ఇదే ఫస్ట్ టైమ్-telangana registered highest ever power consumption on march 14 tuesday details inside ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Registered Highest Ever Power Consumption On March 14 Tuesday Details Inside

TS Power Demand : ఈరోజు విద్యుత్ గట్టిగా వాడేశారుగా.. ఇంతలా ఇదే ఫస్ట్ టైమ్

HT Telugu Desk HT Telugu
Mar 14, 2023 02:35 PM IST

Power consumption In Telangana : ఎండాకాలం మెుదలైంది. విద్యుత్ వినియోగం పెరుగుతోంది. అయితే తెలంగాణ ఆవిర్భావించిన తర్వాత.. ఇంతలా విద్యుత్ వినియోగం పెరగడం ఇదే మెుదటిసారి. ఈ ఒక్కరోజు 15,062 వాట్లు విద్యుత్ వినియోగం నమోదైందని అధికారులు వెల్లడించారు.

విద్యుత్ వినియోగం
విద్యుత్ వినియోగం

తెలంగాణ(Telangana)కు చెందిన సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ గరిష్ట డిమాండ్ మంగళవారం నాటికి 9121 మెగావాట్లు, నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ 5738 మెగావాట్లు ఉండగా, గత ఏడాది ఇదే రోజు వరుసగా 7849 మెగావాట్లు, 4711 మెగావాట్లుగా ఉంది.

ట్రెండింగ్ వార్తలు

తెలంగాణ చరిత్రలోనే అత్యధికంగా 15,062 మెగావాట్ల విద్యుత్ డిమాండ్(Power Demand) మంగళవారం ఉదయం 10.30 గంటలకు నమోదైంది. గతేడాది ఇదే రోజున 12,727 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ నమోదైంది. తెలంగాణకు చెందిన సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ గరిష్ట డిమాండ్ మంగళవారం నాటికి 9121 మెగావాట్లు, నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ 5738 మెగావాట్లు ఉండగా, గత ఏడాది ఇదే రోజు వరుసగా 7849 మెగావాట్లు, 4711 మెగావాట్లుగా ఉంది.

టీఎస్‌ ట్రాస్కో అండ్‌ జెన్‌కో ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డీ ప్రభాకర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం గరిష్ట డిమాండ్‌ 14,138 మెగావాట్లకు చేరుకోగా, మంగళవారం నాటికి 15,062 మెగావాట్లకు చేరడం రికార్డు అయింది. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరగడం, పారిశ్రామిక అవసరాలు పెరగడంతో గత కొన్నేళ్లుగా విద్యుత్ వినియోగం(Power consumption) పెరుగుతోందని చెప్పారు.

గత మార్చిలో అత్యధిక విద్యుత్ వినియోగం 14,160 మెగావాట్లు కాగా, ఈసారి గరిష్ట విద్యుత్ డిమాండ్ 15,062 మెగావాట్లకు చేరుకుందని, ఈ వేసవిలో 16,000 మెగావాట్లను దాటే అవకాశం ఉందని ప్రభాకర్ రావు తెలిపారు. మార్చి నెలలో గరిష్ట డిమాండ్ 15,000 మెగావాట్లకు చేరుకుంటుందని ఇప్పటికే ఊహించామన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేశామని చెప్పారు.

వేసవి(Summer)లో రైతులతో పాటు వినియోగదారులందరికీ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్తు శాఖ చర్యలు తీసుకుంటుందని ప్రభాకర్ రావు హామీ ఇచ్చారు. మొత్తం విద్యుత్ వినియోగంలో దాదాపు 37 శాతం వ్యవసాయ రంగానికే చెందుతుందని చెప్పారు. దక్షిణ భారతదేశంలో తమిళనాడు తర్వాత తెలంగాణ రెండో అతిపెద్ద విద్యుత్ వినియోగదారుగాఉంది.

WhatsApp channel

టాపిక్