TS Temperatures : నిప్పుల గుండంగా నల్గొండ - ఇవాళ రికార్డు ఉష్ణోగ్రతలు నమోదు!
Temperatures Updates: రాష్ట్రంలో భానుడి ప్రతాపం మళ్లీ పెరిగిపోతుంది. రోజురోజుకూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సమ్మర్ సీజన్ ప్రకారం చూస్తే… ఇవాళ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Today Telangana Temperatures : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఓ వైపు ఉక్కపోతతో వేడితో జనం అల్లాడుతున్నారు. ఓవైపు మొన్నటి వరకు పలుచోట్ల వర్షాలు కురిసినప్పటికీ… మళ్లీ ఎండల ప్రభావం పెరిగిపోయింది. ఈ సమ్మర్ సీజన్ లో ఇవాళే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ట్రెండింగ్ వార్తలు
శుక్రవారం(జూన్ 2) నల్గొండ జిల్లాలోని దామరచర్లలో 46. 8 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవ్వగా… పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. కరీంనగర్ జిల్లాలోని తన్గులా ప్రాంతంలో- 45.9, సూర్యాపేట జిల్లాలోని మునగాలలో - 45.7 డిగ్రీలు, జయశంకర్ జిల్లాలోని మహాదేవ్ పూర్ - 45.6, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని జామ్ బుగ్గ -45.6 డిగ్రీలు, సూర్యాపేట జిల్లాలోని పెద్దవీడు -45.5, కొత్తగూడెంలోని యానంబయలు - 45.4, ములుగు జిల్లాలోని తాడ్వాయి మండల పరిధిలో 45.4, సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండల పరిదిలో - 45.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.
ఇక హైదరాబాద్ లోనూ ఎండల తీవ్రత బాగానే ఉంది. కానీ జిల్లాలతో పోల్చితే కాస్త తక్కువగా ఉంది. ఇవాళ ఖైరతాబాద్ లో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి - 42.3, షేక్ పేట- 41.2, ముషీరాబాద్ - 41.2, కూకట్ పల్లి - 41.2, సికింద్రాబాద్ - 41.2, రామచంద్రాపురం - 41.2, చార్మినార్ - 41.2, అసిఫ్ నగర్ - 41.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.
ఏపీలోని ఈ ప్రాంతాలకు హెచ్చరికలు
శనివారం విజయనగరం, మన్యం,అల్లూరి, కాకినాడ,కోనసీమ, ఉభయగోదావరి, ఏలూరు,కృష్ణా,ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు,ప్రకాశం మరియు SPSR నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C - 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల శాఖ హెచ్చరించింది. మిగిలిన జిల్లాల్లో పలుచోట్ల 40°C - 44°Cల నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రేపు 8 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 256 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 127 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ చూస్తే 10 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 105 మండలాల్లో వడగాల్పులు వీచాయని వివరించింది.