TSPSC Paper leak: రద్దైన పరీక్షలకు కొత్త షెడ్యూల్… నేడో రేపో అధికారిక ప్రకటన-telangana public service commission has finalized the new schedule for the canceled exams ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Public Service Commission Has Finalized The New Schedule For The Canceled Exams

TSPSC Paper leak: రద్దైన పరీక్షలకు కొత్త షెడ్యూల్… నేడో రేపో అధికారిక ప్రకటన

HT Telugu Desk HT Telugu
Mar 28, 2023 11:15 AM IST

TSPSC Paper leak: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ ప్రశ్నా పత్రాల లీకేజీతో రద్దు చేసిన పరీక్షలకు కొత్త షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఒకటి రెండు రోజుల్లో కొత్త షెడ్యూల్‌ను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్షను జూన్ 11న నిర్వహించనున్నారు.

టిఎస్‌పిఎస్సీ పరీక్షలకు నేడు కొత్త తేదీల వెల్లడి
టిఎస్‌పిఎస్సీ పరీక్షలకు నేడు కొత్త తేదీల వెల్లడి

TSPSC Paper leak: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌లో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంతో నాలుగు నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలను కమిషన్ రద్దు చేసింది. మరో రెండు పరీక్షలను వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో రద్దయిన, వాయిదా పడిన అయిదు పరీక్షలను తిరిగి నిర్వహించే తేదీలపై టీఎస్‌పీఎస్సీ కసరత్తు పూర్తి చేసింది.

ట్రెండింగ్ వార్తలు

ప్రశ్నాపత్రాల లీకేజీ నేపథ్యంలో నాలుగు నోటిఫికేషన్ల పరీక్షలను కమిషన్‌ రద్దు చేసింది. మరో రెండింటిని వాయిదా వేసింది. గ్రూప్‌-1 ప్రిలిమినరీతో పాటు డివిజనల్‌ అకౌంట్స్‌ అధికారి-డీఏవో, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌-ఏఈఈ, అసిస్టెంట్‌ ఇంజినీర్‌-ఏఈ పరీక్షలు రద్దు అయ్యాయి. టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌-టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి.

ప్రశ్నాపత్రాల లీకేజీతో రద్దైన గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష తేదీని కమిషన్‌ ఇప్పటికే ఖరారు చేసింది. గ్రూప్‌ వన్‌ ప్రిలిమ్స్‌ పరీక్షను జూన్‌ 11న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మిగతా రద్దయిన పరీక్షలతో పాటు వాయిదా పడిన పరీక్షలకు మంగళ లేదా బుధవారాల్లో కొత్త తేదీలు వెల్లడించనున్నారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కొన్ని పోస్టుల భర్తీకి రాతపరీక్షలను గతంలో ఓఎంఆర్‌ పద్ధతిలో నిర్వహించింది. ఇకపై అన్ని పరీక్షలను కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు నిర్వహించాలని టిఎస్‌పిఎస్సీ భావిస్తోంది. ఏ పరీక్షలను కంప్యూటర్‌ ఆధారితంగా నిర్వహించాలి, వేటిని ఓఎంఆర్‌ పద్ధతిలో నిర్వహించాలనే దానిపై ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకోనున్నారు. కొత్త పరీక్ష తేదీలతో పాటు పరీక్షా విధానాన్ని కూడా కమిషన్ వెల్లటడించనుంది.

తెలంగాణలో జరగాల్సిన హార్టికల్చర్‌ అధికారుల నియామక పరీక్షపై కమిషన్‌ మంగళవారం నిర్ణయం తీసుకోనుంది. ఈ పరీక్షను యథావిధిగా నిర్వహిస్తారా, కొంత వ్యవధితో రీషెడ్యూలు చేస్తుందా అన్న దానిపై మంగళవారం కమిషన్‌ స్పష్టత ఇవ్వనుంది. ఉద్యానశా‌ఖ అధికారుల పోస్టులకు ఏప్రిల్‌ 4న ఉదయం, మధ్యాహ్నం వేళల్లో రెండు పేపర్లకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నట్లు గతంలో కమిషన్‌ ప్రకటించింది.

హార్టీ కల్చర్ రిక్రూట్‌మెంట్‌ పరీక్ష తేదీకి వారం రోజుల ముందు హాల్‌టిక్కెట్లను వెబ్‌సైట్లో పొందుపరచాల్సి ఉంది. మార్చి 28వ తేదీ నాటికి అవి అందుబాటులోకి రావాల్సి ఉంది . తెలంగాణలో 22 ఉద్యానవన అధికారుల పోస్టులను భర్తీ చేయనుండటంతో ఈ పరీక్షలకు తక్కువ సంఖ్యలోనే అభ్యర్థులు దరఖాస్తు చేశారు. పరీక్షను వాయిదా వేయాల్సి వస్తే.. తిరిగి మరి కొద్ది రోజుల వ్యవధిలోనే తిరిగి నిర్వహించేందుకు అనువైన తేదీలను కమిషన్‌ పరిశీలిస్తోంది.

 

WhatsApp channel