TRS to BRS : నాలుకకు అందని బిఆర్‌ఎస్‌… ఇంకా టిఆర్‌ఎస్‌గానే చలామణీ….-telangana public and political partys not considering the name change of trs party into brs ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Public And Political Partys Not Considering The Name Change Of Trs Party Into Brs

TRS to BRS : నాలుకకు అందని బిఆర్‌ఎస్‌… ఇంకా టిఆర్‌ఎస్‌గానే చలామణీ….

HT Telugu Desk HT Telugu
Jan 10, 2023 01:07 PM IST

TRS to BRS తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పురుడు పోసుకున్న ఉద్యమ పార్టీ ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందినా, జనం నోటిలో మాత్రం నానడం లేదు. పార్టీ పేరు విషయంలో పాతపేరునే ఎక్కువగా జనం ఉచ్చరిస్తున్నారు. దేశ వ్యాప్తంగా పార్టీని విస్తరించేందుకు కేసీఆర్‌ ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో తాజా పరిణామాలపై ఓ సంస్థ చిన్నపాటి సర్వే నిర్వహించింది. అందులో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి.

పార్టీ పేరు మార్పుపై గందరగోళం....
పార్టీ పేరు మార్పుపై గందరగోళం....

TRS to BRS తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మార్చుకుని భారత రాష్ట్ర సమితిగా ఆవతరించి చాలా రోజులైనా జనం నోళ్లలో మాత్రం పాత పేరే నడుస్తోంది. పార్టీ పేరు మార్పును అధికారికంగా ప్రకటించినా అది ఇంకా పూర్తి స్థాయిలో జనాలకు ఎక్కలేదని పీపుల్స్ పల్స్ అనే సంస్థ చెబుతోంది.

ట్రెండింగ్ వార్తలు

తెలంగాణ రాష్ట్ర సమితిని దేశం మొత్తానికి విస్తరించే లక్ష్యంతో భారతరాష్ట్ర సమితిగా రూపాంతరం చెందినా ప్రజల్లో ఇంకా గందరగోళం మాత్రం వీడలేదు. పార్టీ పేరు అధికారికంగా పేరు మారడంతో ఆ సమాచారాన్ని ఎన్నికల సంఘానికి, లోక్‌సభ, శాసనసభా స్పీకర్‌ కార్యాలయాలకు, ఇతరత్రా అందరికీ తెలియజేశారు. పార్టీ ఆవిర్భావాన్ని కూడా ఘనంగా నిర్వహించారు. పా ర్టీ నాయకులు, కార్యకర్తల శ్రేణులు దాటి పేరు ప్రజల్లోకి మాత్రం మెల్లగా వెళుతున్నట్లు కనిపిస్తోంది.

టిఆర్‌ఎస్‌ పార్టీ పేరు మార్పు ఎంతగా ప్రజాబాహుళ్యంలోకి వెళ్ళిందనే విషయంతో పాటు పార్టీ నాయకుల్లో, కార్యకర్తల శ్రేణుల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ కొత్త పేరు బిఆర్‌ఎస్‌ ఎంతగా మెదళ్లలో నాటుకుందనే దానిపై ‘పీపుల్స్‌పల్స్‌’ ఒక క్విక్‌/ ఇన్‌స్టాంట్‌ సర్వే నిర్వహించింది.

తెలంగాణలోని ఎంచుకున్న 17 జిల్లాల్లో, ఎంచుకున్న 51 మండలాల్లో 1625 మంది సాంపిల్స్‌తో జనవరి 5 నుంచి 9 వ తేది వరకు ఈ సర్వేను నిర్వహించింది. వివిధ జిల్లాల్లోని పార్టీ యంత్రాంగంతో నేరుగా ఫోన్‌ద్వారా సంప్రదించినప్పుడు, వారితో ముచ్చటించినప్పుడు, వారి ముచ్చట్లను గమనించినప్పుడు, వారి నోటి వెంబడి ‘‘బిఆర్‌ఎస్‌’’ అనే మాట వస్తోందా? ఇంకా ‘టిఆర్‌ఎస్‌’ అంటున్నారా? తెలుసుకునేందుకు సర్వే చేపట్టినట్టు నిర్వాహకులు ప్రకటించారు.

ఈ సర్వేలో 72శాతం మంది పార్టీ పేరును టిఆర్‌ఎస్‌గానే పేర్కొన్నారు. పార్టీ పేరు విషయంలో తడబాటుకు గురై బిఆర్ఎస్ అని సవరించుకున్న వాళ్లు 21శాతం మంది ఉన్నారని పేర్కొన్నారు. కేవలం నాలుగు శాతం మంది మాత్రమే బిఆర్ఎస్ పార్టీ పేరును నేరుగా ప్రస్తావించారు. పార్టీ పేరును ప్రస్తావించకుండానే 3శాతం మంది పార్టీ గురించి మాట్లాడినట్లు వెల్లడించారు.

WhatsApp channel

టాపిక్