Ts Polycet Results: తెలంగాణ పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల
Ts Polycet Results: తెలంగాణ పాలిటెక్నిక్ ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక భవన్‌లో ఫలితాలను ప్రకటించారు. పరీక్షల్లో 82.7 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు.
Ts Polycet Results: తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన 'పాలిసెట్' ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ విడుదల చేశారు.
మే 17న జరిగిన ఈ పరీక్షకు మొత్తం 1,05,742మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 98,273 మంది అభ్యర్థులు ప్రవేశపరీక్షకు హాజరయ్యారు. హాజరైన వారిలో 54,700 మంది అబ్బాయిలు ఉండగా, 43,573 మంది అమ్మాయిలు ఉన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం ఈ పరీక్ష నిర్వహించారు.
ప్రవేశపరీక్షకు హాజరైన వారిలో 82.7 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు కమిషనర్ వెల్లడించారు. 86.63 శాతం ఉత్తీర్ణతతో అమ్మాయిలు సత్తా చాటారు. పాలిసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలు, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, పీవీ నర్సింహారావు తెలంగాణ యూనివర్సిటీల్లో ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్, టెక్నాలజీ కోర్సులు, అగ్రికల్చర్ డిప్లొమా, సీడ్ టెక్నాలజీ, ఆర్గానిక్ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్–2023 ప్రవేశపరీక్ష మే17న నిర్వహించారు. . ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.
పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 296 పరీక్ష నిర్వహించారు. పరీక్షల్లో అర్హత సాధించిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో మూడేళ్ల ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించనున్నారు. ఇందుకు సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేయనున్నారు.