TS Constable Results : తెలంగాణ కానిస్టేబుల్ తుది ఫలితాలు వచ్చేశాయ్!-telangana police recruitment board released constable final results ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Constable Results : తెలంగాణ కానిస్టేబుల్ తుది ఫలితాలు వచ్చేశాయ్!

TS Constable Results : తెలంగాణ కానిస్టేబుల్ తుది ఫలితాలు వచ్చేశాయ్!

Bandaru Satyaprasad HT Telugu
Oct 04, 2023 08:49 PM IST

TS Constable Results : తెలంగాణ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదలైయ్యాయి.

కానిస్టేబుల్ ఫలితాలు
కానిస్టేబుల్ ఫలితాలు

TS Constable Results : తెలంగాణ కానిస్టేబుల్‌ తుది ఫలితాలు విడుదల అయ్యాయి. పోలీస్ నియామక మండలి బుధవారం సాయంత్రం కానిస్టేబుల్ తుది ఫలితాలను ప్రకటించింది. మొత్తంగా 15,750 పోస్టులకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలు గురువారం ఉదయం నుంచి https://www.tslprb.in/ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయని పోలీస్ నియామక మండలి పేర్కొంది.

రేపు వెబ్ సైట్ లో అభ్యర్థుల వివరాలు

తెలంగాణ పోలీస్‌ కానిస్టేబుల్‌ తుది ఫలితాలను స్టేట్‌ లెవెల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బుధవారం ప్రకటించింది. మొత్తం 15,750 మంది పోస్టులకు సంబంధించి అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళా అభ్యర్థులు ఎంపికయ్యారు. కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను గురువారం పోలీస్ నియామక మండలి వెబ్ సైట్ లో విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఖాళీగా కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి గతేడాది నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. స్పెషల్ పోలీస్, సివిల్ పోలీస్, ఏఆర్ తదితర విభాగాల్లో ఈ పోస్టులు భర్తీ చేశారు. పలు విభాగాల్లో 16,604 పోస్టులకు గాను 15,750 మంది ఎంపికైనట్టు పోలీస్‌ నియామక బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. కోర్టులో కేసుల కారణంగా పలు పోస్టులకు ఫలితాలు విడుదల చేయలేదని బోర్డు పేర్కొంది. పీటీవోలోని 100 డ్రైవర్‌ పోస్టులు, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖలోని 225 పోస్టులకు ఫలితాలు కోర్టు కేసుల కారణంగా విడుదల చేయలేదని వెల్లడించింది.

తెలంగాణ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు పోలీస్ నియామక బోర్డ్ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 30న కానిస్టేబుల్ తుది రాత పరీక్షలు నిర్వహించారు. సివిల్ కానిస్టేబుల్ పరీక్షలకు మొత్తం 1,09,663 మంది అర్హత సాధించగా.. ఇందులో 1,08,055 మంది పరీక్షకు హాజరయ్యారని బోర్డు తెలిపింది. తెలంగాణ పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో స్టెఫండరీ క్యాడెట్ ట్రైనీ కానిస్టేబుల్ (సివిల్/ఎ.ఆర్/ టి.ఎస్.ఎస్.పి/ఎస్.పి.ఎఫ్/ఎస్.ఏ.ఆర్ సిపిఎల్/ఎస్.ఎఫ్.ఓ) అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఏప్రిల్ 30న తుది రాత పరీక్ష నిర్వహించారు. మొత్తం 98.53 శాతం మంది పరీక్షకు హాజరైనట్లు తెలంగాణ పోలీస్ నియామక మండలి పేర్కొంది.