TS SI Constable Events: డిసెంబర్ లో ఫిజికల్ ఈవెంట్స్ పరీక్షలు..!-telangana police constable and si events will be conduct un december month 2022 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Police Constable And Si Events Will Be Conduct Un December Month 2022

TS SI Constable Events: డిసెంబర్ లో ఫిజికల్ ఈవెంట్స్ పరీక్షలు..!

HT Telugu Desk HT Telugu
Nov 16, 2022 01:58 PM IST

telangana police jobs updates: పోలీస్ ఉద్యోగాల భర్తీలో భాగంగా చేపట్టే ఈవెంట్స్(శారీరక సామర్థ్య పరీక్షల) నిర్వహణపై రిక్రూట్ మెంట్ బోర్డు కసరత్తు చేస్తోంది. కీలకమైన ఫిజికల్‌ ఎఫీషియెన్సీ టెస్ట్‌(పీఈటీ), ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌(పీఎంటీ) లాంటి వాటిని డిసెంబరు మొదటి వారంలో నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. దీనిపై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

త్వరలోనే కానిస్టేబుల్ ఈవెంట్స్ (ఫైల్ ఫొటో)
త్వరలోనే కానిస్టేబుల్ ఈవెంట్స్ (ఫైల్ ఫొటో) (facebook)

telangana police constable ans si events 2022: ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి పోస్టుల శారీరక సామర్థ్య పరీక్షల నిర్వహణకు త్వరలోనే ప్రకటన రానుంది. ఈ మేరకు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఎంపిక ప్రక్రియలో కీలకమైన ఫిజికల్‌ ఎఫీషియెన్సీ టెస్ట్‌(పీఈటీ), ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌(పీఎంటీ) లాంటి వాటిని డిసెంబరు మొదటి వారంలో నిర్వహించేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

12 కేంద్రాల్లో ఈవెంట్స్....

ఈవెంట్స్ పరీక్షలను నిర్వహించేందుకు 12 కేంద్రాలను ఎంపిక చేసింది రిక్రూట్ మెంట్ బోర్డు. వాటిలో సదుపాయాలు కల్పించేందుకు కసరత్తు ప్రారంభించింది. మొదలుపెట్టిన నాటి నుంచి 25 రోజుల్లో ఈ పరీక్షలు పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు సమాచారం. ఫిజికిల్ ఈవెంట్స్ కు ఎంపిక చేసిన మైదానాల్లో ఇంటర్‌నెట్‌ అందుబాటులో ఉంచడంతోపాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించింది. అన్ని కుదిరితే ఈ నెల చివరి వారంలోనే ఈ పరీక్షలు ప్రారంభించాలని అధికారులు ఉన్నట్లు సమాచారం.

ఒక్కసారే....

గతంలో ఒక అభ్యర్థి ఎన్ని పోస్టులకు పోటీ పడితే ఆన్నిసార్లు శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించేది. కానీ ఈసారి మాత్రం కీలక మార్పులు చేశారు. ఎన్నింటికి పోటీపడినా ఒకసారి అర్హత సాధిస్తే సరిపోయేలా మార్పులు చేశారు. ఒకసారి క్వాలిఫై అయితే ఆ ఫలితాల్ని మూడు నెలలపాటు పరిగణనలోకి తీసుకోనున్నట్లు మండలి ప్రకటించింది. ఆ దిశగానే అమలు చేయనున్నారు.

త్వరలో ఆన్‌లైన్‌లో అడ్మిట్ కార్డులు ....

శారీరక సామర్ధ్య పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమతో పాటు అడ్మిట్ కార్డులను వెంట తెచ్చుకోవాలని, బయోమెట్రిక్ ద్వారా పరీక్షలకు అనుమతిస్తారని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. అడ్మిట్ కార్డులను అర్హత సాధించిన అభ్యర్థులకు నేరుగా పంపనున్నారు. https://www.tslprb.in/ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకరోవాల్సి ఉంటుంది. తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి కూడా వీటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 25రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి పూర్తి చేసేందుకు బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్‌ 25వ తేదీలోపు సామర్ధ్య పరీక్షలు నిర్వహించే క్రీడా ప్రాంగణాలను సిద్ధం చేయాలని అన్నిజిల్లాలకు బోర్డు సమాచారం పంపింది.

IPL_Entry_Point