TS Police : విద్యార్థులకు పోలీస్ శాఖ వ్యాసరచన పోటీలు.. బహుమతులు గెలుచుకోండి
Essay writing competitions for students: విద్యార్థులకు కీలక ప్రకటన చేసింది తెలంగాణ పోలీసు శాఖ. పోలీసు అమర వీరుల సందర్భంగా ఆయా విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.
ts police conducting essay writing competitions : విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసులను స్మరించుకుంటూ నిర్వహించే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (అక్టోబరు 21న)ను ఘనంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ ఏర్పాటు చేస్తోంది. ఈ సందర్భంగా విద్యార్థులకు ఓ ప్రకటన చేసింది.
విద్యార్థులకు ఆన్‌లైన్ వ్యాసరచన పోటీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో రెండు రకాలుగా ఉన్నాయి. 8వ తరగతి నుంచి డిగ్రీ, ఆపై స్థాయి విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చు.
8వ తరగతి నుంచి ఇంటర్ వరకు ‘రోడ్డు ప్రమాదాలు నివారించడంలో పౌరుల పాత్ర’ అనే అంశంపై వ్యాసం రాయాల్సి ఉంటుంది. ఇక డిగ్రీ నుంచి ఆపైస్థాయి(పీజీ, ఇతర కోర్సులు) చదువుకునేవారికి ‘సైబర్ నేరాలు నియంత్రించడంలో పౌరులు-పోలీస్ పాత్ర’ అనే అంశంపై వ్యాసరచన ఉంటుంది. ఈ నెల 24వ తేదీలోపు విద్యార్థులు ఆన్‌లైన్‌లో తమ వ్యాసాలు సమర్పించాలి.
ఇలా సబ్మిట్ చేయండి....
సబ్మిట్ చేయడానికి పోలీస్ శాఖ ఇచ్చిన లింక్ https://forms.gle/y5kk13WkPQYvgfW16 పై క్లిక్ చేయాలి
మీ పేరు, తరగతి ఇతర వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
మీ వ్యాసాన్ని పేర్కొన్న ప్రదేశంలో పదాల పరిమితి మించకుండా సమర్పించాలి.
మీ వ్యాసానికి సమర్పించేందుకు చివరి తేదీ - 24 -10 -2022
జిల్లా, కమిషనరేట్ల స్థాయిలో బహుమతులు గెలుపొందినన వ్యాసాల్లో ఉత్తమ మూడు వ్యాసాలను... రాష్ట్రంలోని మొదటి మూడు ఉత్తమ వ్యాసాలుగా ఎంపిక చేస్తారు.
ఛాయాచిత్ర పోటీలో భాగంగా విధి నిర్వహణలో పోలీసుల సేవలకు సంబంధించిన ఫొటోలను ఈ నెల 28లోగా ఆన్‌లైన్‌లో పంపాలని ప్రకటన విడుదల చేశారు.