తెలంగాణ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర పన్నిన వారికి.. బిగ్ ట్విస్ట్ ఇచ్చారు మన పోలీసులు. పక్కా ప్లానింగ్‌తో బ్లాస్ట్ చేద్దామనుకున్న విజయనగరానికి చెందిన సిరాజ్, సమీర్ అనే ఇద్దరు నిందితుల్ని.. స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. సిరాజ్-సమీర్ కలసి హైదరాబాద్‌లో బ్లాస్ట్‌లకు ప్లాన్ చేసినట్లు పోలీసులు తేల్చారు. విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసి.. హైదరాబాద్‌లో డమ్మీ బ్లాస్ట్‌కు ప్లాన్ చేశారని బయటపడింది. సౌదీ అరేబియా నుంచి ఐసిస్ మాడ్యూల్ సమీర్-సిరాజ్‌కు ఆదేశాలు ఇచ్చింది. బ్లాస్ట్‌లకు ప్లాన్ చేసిన ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకొని ముప్పును తప్పించారు.
ఇప్పుడే కాదు.. గతంలోనూ హైదరాబాద్ నగరంలో పేలుళ్లకు కుట్రలు జరిగాయి. ఇటీవల ఆపరేషన్ సింధూర్ జరిగిన నేపథ్యంలోనూ.. బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు బెదిరింపు కాల్స్ రాగా.. పోలీసులు అలర్ట్ అయ్యి.. తనిఖీలు నిర్వహించారు. కానీ.. ఏం లభ్యం కాలేదు. ఆ తర్వాత ఓ స్కూలుకు బెదిరింపు కాల్ వచ్చింది.
పహల్గామ్‌లో పర్యాటకులను టెర్రరిస్టులు చంపిన తర్వాత.. దేశ వ్యాప్తంగా అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. హైదరాబాద్ నగరంలో నిఘా పెంచారు. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రదేశాల్లో నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేశారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కోఠీ షాపింగ్ జోన్, మెట్రో స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
భాగ్యనగరంలో ఉగ్రదాడులు జరగొచ్చని కేంద్రం హెచ్చరించింది. దీంతో తెలంగాణలోని అన్ని పోలీస్ విభాగాలు అలర్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే బాంబ్ బ్లాస్ట్‌కు ప్లాన్ చేస్తున్నారని సమాచారం కౌంటర్ ఇంటెలిజెన్స్ టీమ్‌కు సమాచారం అందింది. దీనిపై సీక్రెట్ ఆపరేషన్ చేపట్టారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి.. నిందితులను పట్టుకున్నారు. నిందితుల్లో ఒకరి తండ్రి పోలీస్ అధికారిగా తెలుస్తోంది.
సంబంధిత కథనం