TS New Secretariat Building : సంక్రాంతి తర్వాతే కొత్త సచివాలయం-telangana new secretariat building likely to start after sankranti festival ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana New Secretariat Building Likely To Start After Sankranti Festival

TS New Secretariat Building : సంక్రాంతి తర్వాతే కొత్త సచివాలయం

HT Telugu Desk HT Telugu
Nov 09, 2022 02:32 PM IST

Telangana Secretariat : తెలంగాణలో కొత్త సచివాలయ సముదాయానికి సంబంధించిన పనులు తుదిదశకు చేరుకున్నాయి. సంక్రాంతి తర్వాత ప్రారంభోత్సవం జరిగే అవకాశం ఉంది. అయితే ఫార్ములా-ఇ రేసుకు ముందు, వచ్చే జనవరి 14 నుంచి ఫిబ్రవరి 11 మధ్య ఉంటుందని తెలుస్తోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో కొత్త సచివాలయం(New Secretariat) సంక్రాంతి తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఫార్ములా-ఇ రేస్‌(Formula E Race) జరగనుంది. అయితే రహదారికి అవతలి వైపున ఉన్న తెలంగాణ అమరవీరుల స్మారకంతో పాటు కాంప్లెక్స్‌ను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) కు ప్రతిపాదనలు వెళ్లాయి. ముఖ్యమంత్రి ఆమోదం కోసం ఎదురుచూస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

సచివాలయ సముదాయంలో రెండు భారీ గోపురాలను ఏర్పాటు చేసే పనులు జరుగుతున్నాయి. వాటిలో ఒకటి మంగళవారం ఏర్పాటు చేశారు. గోపురం పైన ఉన్న జాతీయ చిహ్నంతో భవనం 278 అడుగుల ఎత్తుకు వెళుతుంది. లుంబినీ పార్కు(Lumbini Park) పక్కనే తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం నిర్మాణం కూడా తుదిదశకు చేరుకుంది. సుమారు 90 శాతం వరకు పనులు జరిగినట్టుగా తెలుస్తోంది.

తొలుత సచివాలయ ప్రారంభోత్సవానికి దసరా (అక్టోబర్ 5) డెడ్‌లైన్ విధించారు సీఎం కేసీఆర్(CM KCR). పనులు పెండింగ్‌లో ఉండటంతో వాయిదా వేశారు. 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏడు అంతస్తుల నిర్మాణంతో ఈ సముదాయం నిర్మాణం జరుగుతుంది. దాదాపు 650 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించారు.

3 లక్షల చ.అ.ల విస్తీర్ణంలో ఉన్న అమరవీరుల స్మారకం కాంతితో దీపంలా ఉంటుంది. దీని పార్కింగ్ స్థలంలో దాదాపు 300 కార్లు, 600 ద్విచక్ర వాహనాలు ఉంటాయి. మొదటి అంతస్తులో ఫోటో గ్యాలరీ(Photo Gallery), మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ ఉంటాయి. రెండో, మూడో అంతస్తులలో వరుసగా కన్వెన్షన్ సెంటర్, రెస్టారెంట్లు ఉండనున్నాయి.

తెలంగాణ సచివాలయం(Telangana Sachivalayam) మొత్తం డిజైన్లో తెలంగాణ చరిత్ర, విభిన్న సంస్కృతులు ప్రతిబింబించేలా ఉంటాయి. బయటి పోడియం క్లాడింగ్ ఎర్ర ఇసుక రాయితోనూ.. సెంట్రల్ టవర్ రాజస్థాన్ లేత గోధుమరంగు ధోల్పూర్ ఇసుకరాయి క్లాడింగ్‌తో ఉంటుంది. ఇతర నిర్మాణంపై తెలుపు రంగులో ఉన్నాయి.

భవనం మెుత్తం వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మితమవుతోంది. అన్ని లిఫ్టులు, మెట్లు, యుటిలిటీ గదుల రూపకల్పన ప్రణాళిక ప్రకారం చేశారు. ప్రధాన ప్రవేశం తూర్పు వైపున ఉంది. ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రవేశ ద్వారం ఉంటుంది. ముఖ్యమంత్రి ఛాంబర్‌, క్యాబినెట్ సమావేశ మందిరం, ముఖ్య కార్యదర్శి, సలహాదారులు, వ్యక్తిగత కార్యదర్శులు, సహాయక సిబ్బంది, VIP వేచి ఉండే ప్రదేశాలు సైతం చూసేందుకు ముచ్చటగా ఉంటాయి.

మిగిలిన అంతస్తుల్లో మంత్రుల ఛాంబర్లు, వివిధ విభాగాలు, సహాయక సిబ్బంది, సమావేశ గదులు, సాధారణ పరిపాలనా విభాగం కోసం కేటాయిస్తారు. దిగువ అంతస్తులలో పెద్ద సమావేశ మందిరాలు, వీవీఐపీలు వెయిటింగ్ ప్రదేశాలు, పోలీసు నిఘాలు, ఇంటెలిజెంట్ బిల్డింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ (IBMS) రికార్డ్ రూమ్‌లు, స్టోర్‌లు మొదలైనవి ఉంటాయి.

IPL_Entry_Point