TSMS Inter Admissions 2024 : తెలంగాణ మోడల్ స్కూల్ 'ఇంటర్' ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల - ముఖ్య తేదీలివే
TS Model School Admissions 2024 : తెలంగాణ మోడల్ స్కూళ్లల్లో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మే 31వ తేదీ వరకు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
TS Model School Inter Admissions 2024 : తెలంగాణలోని మోడల్ స్కూళ్లలోని ఇంటర్ ప్రవేశాలకు(TSMS Inter Admissions 2024) సంబంధించి ప్రకటన విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కల్పిస్తారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం వారికి మాత్రం ఈ ప్రవేశాలు ఉంటాయి.
ఇందుకు సంబంధించిన దరఖాస్తులు మే 10వ తేదీ నుంచే ప్రారంభం కానున్నాయి. ఆన్ లైన్ లోనే దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. మే 31వ తేదీని తేదీని తుది గడువుగా ప్రకటించారు. పదో తరగతి అర్హత పొందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు అవుతారు.
ముఖ్య వివరాలు:
- అడ్మిషన్ల ప్రకటన - తెలంగాణ మోడల్ స్కూల్.
- ప్రవేశాలు - ఇంటర్ ఫస్ట్ ఇయర్(ఇంగ్లీష్ మీడియం)
- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం(ఆంగ్ల మాధ్యమం)లో ప్రవేశాలు కల్పిస్తారు.
- ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూప్‌లలో అడ్మిషన్లు ఇస్తారు.
- అర్హత - పదో తరగతి అర్హత సాధించినవారు దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు విధానం - ఆన్ లైన్
- దరఖాస్తులు ప్రారంభం - 10, మే, 2024.
- దరఖాస్తులకు తుది గడువు -31 మే , 2024.
- ఎంపిక విధానం - పదో తరగతి మార్కుల మెరిట్, రిజర్వేషన్లు, ధ్రువపత్రాల ఆధారంగా తుది జాబితాను వెల్లడిస్తారు.
- అధికారిక వెబ్ సైట్ - https://telanganams.cgg.gov.in/
ఏపీ మోడల్ స్కూల్ ఇంటర్ ప్రవేశాలు….
APMS Inter Admissions 2024: ఏపీ మోడల్ స్కూళ్లలోని ఇంటర్ ప్రవేశాలకు(APMS Inter Admissions 2024) దరఖాస్తులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా.... 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు కల్పిస్తారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం వారికి మాత్రం ఈ ప్రవేశాలు ఉంటాయి. ఇందుకు సంబంధించి ఆన్ లైన్ లోనే దరఖాస్తులు చేసుకోవాలి.మే 22వ తేదీని తుది గడువుగా ప్రకటించారు.
ముఖ్య వివరాలు:
- అడ్మిషన్ల ప్రకటన - ఏపీ మోడల్ స్కూల్
- ప్రవేశాలు - ఇంటర్ ఫస్ట్ ఇయర్
- ఏపీలోని 164 మోడల్ స్కూల్స్‌లో ప్రవేశాల ద్వారా ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూప్‌లలో అడ్మిషన్లు ఇస్తారు.
- అర్హత - పదో తరగతి అర్హత సాధించినవారు దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు విధానం - ఆన్ లైన్
- అప్లికేషన్ ఫీజు - ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.150 చెల్లించాల్సి ఉంటుంది.
- దరఖాస్తులకు తుది గడువు - మే 22, 2024.
- ఎంపిక విధానం - పదో తరగతి మార్కుల మెరిట్, రిజర్వేషన్లు, ధ్రువపత్రాల ఆధారంగా తుది జాబితాను వెల్లడిస్తారు.
- అధికారిక వెబ్ సైట్ - https://apms.apcfss.in/
ఇంటర్ ప్రవేశాలు….
TS Inter Admissions 2024-25 : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు రెండేళ్ల ఇంటర్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో అప్లికేషన్లు జారీ చేస్తున్నారు. మే 31 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ప్రైవేట్, ఎయిడెట్, అన్ ఎయిడెట్, కో-ఆపరేటివ్, టీఎస్ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ, కేజీబీవీ, టీఎమ్ఆర్జేసీ, టీఎస్ మోడల్ జూనియర్ కాలేజీలు, కాంపోజిట్ డిగ్రీ కాలేజీల్లో రెండేళ్ల ఇంటర్ కోర్సులు అందిస్తున్నారు. వీటిల్లో అడ్మిషన్లు పొందేందుకు 2024-25 విద్యాసంవత్సరానికి విద్యార్థుల నుంచి అప్లికేషన్లు ఆహ్వానించింది.
- తొలి విడత అప్లికేషన్లు జారీ : 09-05-2024
- కళాశాలలో దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 31-05-2024
- తరగతుల ప్రారంభ తేదీ : 01-06-2024
- తొలి విడతలో అడ్మిషన్లు పూర్తయ్యే తేదీ : 30-06-2024
- సెకండ్ ఫేజ్ అడ్మిషన్ల షెడ్యూల్ త్వరలో విడుదలవుతుంది.