TS Model School Admissions 2024 : తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాలు - దరఖాస్తులకు మరో ఛాన్స్, కొత్త తేదీలివే
TS Model School Admissions 2024 Updates: తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాలకు సంబంధించి అప్డేట్ అందింది. దరఖాస్తుల గడువు ముగియటంతో పొడిగిస్తూ ప్రకటన విడుదలైంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి….
TS Model School Admissions 2024 : మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. 6వ తరగతిలో కొత్తగా ప్రవేశాలు కల్పించడంతో పాటు 7-10 తరగతుల్లోని ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. దరఖాస్తు ప్రక్రియ జనవరి 12వ తేదీన ప్రారంభమై,,, ఫిబ్రవరి 22వ తేదీన ముగిసింది. అయితే ఈ గడువును పొడిగించారు. మార్చి 11వ తేదీ వరకు అవకాశం కల్పించారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో కోరారు. విద్యార్థులు పరీక్ష ఫీజు కింద రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 7వ తేదీన ఎగ్జామ్ ఉండనుంది.
ముఖ్య వివరాలు:
మోడల్ స్కూల్స్ ప్రవేశాలు - 2024 - 2025
ప్రవేశాలు కల్పించే తరగతులు - 6, 7, 8, 9, 10.
దరఖాస్తు విధానం - ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తులు ప్రారంభం - జనవరి 12, 2024
దరఖాస్తులకు తుది గుడువు - మార్చి 11, 2024
హాల్ టికెట్లు డౌన్లోడ్ - 1, ఏప్రిల్, 2024
పరీక్ష తేదీ - ఏప్రిల్ 7, 2024.
టైమింగ్స్ -ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 6వ తరగతి వారికి, ➥ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7 నుంచి 10వ తరగతికి పరీక్షలు నిర్వహిస్తారు.
ఎగ్జామ్ సెంటర్ - అభ్యర్థులు వారివారి మండల కేంద్రాల్లో పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
పరీక్ష విధానం - మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయిస్తారు. మొత్తం నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగానికి 25 మార్కులు కేటాయించారు. 6వ తరగతికి (తెలుగు, మ్యాథమెటిక్స్, సైన్స్&సోషల్(ఈవీఎస్), ఇంగ్లిష్) నుంచి మిగతా తరగతులవారికి (ఇంగ్లిష్,మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్) నుంచి ప్రశ్నలు అడుగుతారు.
పరీక్ష సమయం - 2 గంటలు.
ఎంపిక విధానం - ప్రవేశ పరీక్ష ఆధారంగా
అధికారిక వెబ్ సైట్ - https://telanganams.cgg.gov.in/TSMSWEB20/#/
ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశాలు…
AP Model Schools Admissions 2024: ఆంధ్రప్రదేశ్ లోని ఆదర్శ పాఠశాలల్లో (AP Mode Schools) ఆరో తరగతిలోప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తారు. మార్చి 1వ తేదీన ప్రకటన విడుదలకాగా… మార్చి 31వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష జరగనుంది. https://apms.apcfss.in/ వెబ్ సైట్ లో వివరాలను చూడవచ్చు.
ముఖ్య వివరాలు:
ప్రవేశాలు - ఏపీ మోడల్ స్కూల్స్
ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు.
ప్రస్తుతం 5వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత కలిగి ఉండాలి.
ఓసీ, బీసీ కులాలకు చెందిన విద్యార్థులు 01.09.2012 -31.08.2014 మధ్య జన్మించి ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన విద్యార్థులు 01.09.2010 -31.08.2014 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు విధానం - ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి.
రుసుం - ఓసీ, బీసీ విద్యార్థులు రూ.150 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 75 కట్టాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం - మార్చి 01,2024.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31. మార్చి.2024.
పరీక్ష తేదీ -21. ఏప్రిల్ .2024 (ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు ఉండే స్థానిక మండల కేంద్రాల్లో పరీక్షలు రాయాల్సి ఉంటుంది.)
సంబంధిత కథనం