TS Mega DSC 2024: తెలంగాణ మెగా డిఎస్సీ… మార్చి 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ.. ఏప్రిల్2 వరకు ఫీజు చెల్లింపు గడువు-telangana mega dsc 2024 applications from march 4 deadline till april 2 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Mega Dsc 2024: తెలంగాణ మెగా డిఎస్సీ… మార్చి 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ.. ఏప్రిల్2 వరకు ఫీజు చెల్లింపు గడువు

TS Mega DSC 2024: తెలంగాణ మెగా డిఎస్సీ… మార్చి 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ.. ఏప్రిల్2 వరకు ఫీజు చెల్లింపు గడువు

Sarath chandra.B HT Telugu
Feb 29, 2024 12:23 PM IST

TS Mega DSC 2024: తెలంగాణ మెగా డిఎస్సీ దరఖాస్తుల స్వీకరణ మార్చి 4వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. జిల్లాల వారీగా ఖాళీల వివరాలను అదే రోజు ప్రకటిస్తారు. ఇన్ఫర్మేషన్ బ్రోచర్‌ మార్చి 4 నుంచి అందుబాటులోకి రానుంది.

తెలంగాణలో మెగా డిఎస్సీ 2024 విడుదల
తెలంగాణలో మెగా డిఎస్సీ 2024 విడుదల

TS Mega DSC 2024: తెలంగాణలో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వెలువడింది. గత సెప్టెంబర్‌లో విడుదలైన నోటిఫికేషన్ రద్దు చేసిన ప్రభుత్వం 11వేల పోస్టులతో తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. పాఠశాల విద్యా శాఖ అధికారులతో కలిసి సిఎం రేవంత్ రెడ్డి CM Revanth నోటిఫికేషన్ విడుదల చేశారు.

స్కూల్ అసిస్టెంట్లు SA, సెకండరీ గ్రేడ్ టీచర్లు SGT, లాంగ్వేజ్ పండిట్లు LP & ఫిజికల్ ఎడ్యుకేషన్ PET టీచర్లు మరియు ప్రైమరీ లెవెల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల రిక్రూట్‌మెంట్ కోసం DSC-2024 ద్వారా నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని స్థానిక సంస్థల పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకాలను చేపట్టనున్నారు.

తాజా నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, లాంగ్వేజ్ పండిట్లు & ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు మరియు ప్రైమరీ లెవెల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లను భర్తీ చేస్తారు. ఈ మేరకు G.O.Ms.No.96, ఫైనాన్స్ ద్వారా అనుమతినిచ్చారు. గతంలో ప్రకటించిన నోటిఫికేషన్ రద్దు చేయడంతో పాటు అదనపు పోస్టులతో కలిపి కొత్త నోటిఫికేషన్ వెలువరించారు.

గతంలో డిఎస్సీ దరఖాస్తు చేసుకున్నవారిని తాజా నియామకాలకు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇచ్చారు. తాజా ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా, పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం కొత్తగా మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 2024 మార్చి 4వ తేదీ నంచి పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్ ‌లో https://schooledu.telangana.gov.in లో నోటిఫికేషన్ అందుబాటులోకి రానుంది. అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది.

అన్ని కేటగిరీలలో కలిపి 11062 పోస్టుల కోసం జిల్లా ఎంపిక కమిటీ-2024 DSC ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి మరియు అప్పర్ ప్రైమరీ/సెకండరీ లెవెల్‌లో SGTలు, LPలు, PETలు మరియు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లను భర్తీ చేస్తారు. జిల్లాల వారీగా నోటిఫైడ్ టీచర్ పోస్టులు అనుబంధంలో ఇస్తారు.

దరఖాస్తుదారులు ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత రుసుము చెల్లించి దరఖాస్తు సమర్పించాలని సూచించారు. సమాచార బులెటిన్ మార్చి 4వ తేదీ నుంచి వెబ్‌సైట్ లో https://schooledu.telangana.gov.in లో అందుబాటులో ఉంటుంది.

డిఎస్సీ 2024 ఫీజు

అప్లికేషన్ ప్రాసెసింగ్ మరియు వ్రాత పరీక్ష కోసం చెల్లించాల్సిన రుసుము ఒక్కో పోస్ట్‌కు రూ.1000/- చెల్లించాలి. వేర్వేరు పోస్ట్‌లకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు ఒక్కో పోస్ట్‌కు విడిగా రూ. 1000/- రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసే ప్రతి పోస్ట్‌కు వేర్వేరు దరఖాస్తులను సమర్పించాలి.

ఫీజు చెల్లింపు విధానం

మార్చి4 వ తేదీ విద్యాశాఖ వెబ్‌సైట్‌లో https://schooledu.telangana.gov.in ఫీజు చెల్లింపు గేట్‌వే లింక్ ద్వారా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ / నెట్-బ్యాంకింగ్ ద్వారా ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. ఏప్రిల్ 2వ తేదీతో ఫీజు చెల్లింపు గడువు ముగియనుంది. ఏప్రిల్ 3వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పూర్తి చేయడానికి దశల వారీ విధానాన్ని మార్చి 4వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకువస్తారు. గరిష్ట వయోపరిమితిని 46ఏళ్లుగా పేర్కొన్నారు.

కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష….

 

డిఎస్సీ 2024 ఉద్యోగాల భర్తీని కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) కింది "ఆన్‌లైన్"‌లో నిర్వహిస్తారు. తెలంగాణలో 11 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. 1) మహబూబ్‌నగర్, 2) రంగారెడ్డి, 3) హైదరాబాద్, 4) మెదక్, 5) నిజామాబాద్, 6) ఆదిలాబాద్, 7) కరీంనగర్, 8) వరంగల్, 9) ఖమ్మం, 10) నల్గొండ మరియు 11) సంగారెడ్డి జిల్లాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.

దరఖాస్తు చేసే అభ్యర్థులు తమ దరఖాస్తులో పరీక్షా కేంద్రాల ప్రాధాన్యత క్రమాన్ని సమర్పించవచ్చు. అభ్యర్థులను కేంద్రాలకు కేటాయించడం అనేది పరీక్ష జరిగేష్ట తేదీలలో అయా కేంద్రాల సామర్థ్యంతో పాటు సీట్ల లభ్యతపై ఆధారపడి ఉంటుంది.

డిఎస్సీ 2024 వ్రాత పరీక్ష షెడ్యూల్ - పరీక్ష తేదీలను తర్వాత ప్రకటిస్తారు.

Whats_app_banner