BRS KTR : దేశంలో బీజేపీ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బ తీసిందన్నకేటీఆర్‌-telangana it minister ktr fires on union government and prime minister modi ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana It Minister Ktr Fires On Union Government And Prime Minister Modi

BRS KTR : దేశంలో బీజేపీ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బ తీసిందన్నకేటీఆర్‌

HT Telugu Desk HT Telugu
Oct 07, 2022 07:47 PM IST

BRS KTR కాళేశ్వరం, మిషన్ భగీరథ పథకాలతో నీరు, 24 గంటల ఉచితంగా కరెంటు ఇవ్వొచ్చని దేశంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి వ్యవసాయం దండగ కాదు పండుగ అని స్వల్ప సమయంలో నిరూపించిన వ్యక్తి కేసీఆర్ అన్నారు మంత్రి కేటీఆర్. రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గిన రాష్ట్రం గా తెలంగాణగా నిలిచిందని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో లెక్కలు చెప్పాయన్నారు.

ప్రధానిపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ విమర్శలు
ప్రధానిపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ విమర్శలు (twitter)

BRS KTR తెలంగాణలో రైతులకు ఉన్న అద్భుతమైన పథకాలు రైతుబంధు, రైతుబీమా, రైతు వేదికలు, రైతు సమితీలు దేశంలో ఎక్కాడా లేవన్నారు కేటీఆర్‌. ఈ పథకాలతో తెలంగాణ రైతులు పంజాబ్, హర్యాణా రైతులతో తెలంగాణ రైతులు పోటీ పడుతున్నారని చెప్పారు. హరిత విప్లవం తో పంజాబ్ , హర్యానా రైతులు దేశానికి అండగా ఉన్నారని అలాంటి వారితో తెలంగాణ రైతులు పోటీపడుతున్నారన్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఇంటింటికి తాగునీరు ఇవ్వడం పెద్ద విషయమని, తెలంగాణ సాధన పెద్ద విషయం కాదని ఎలా కొంతమందికి అనిపిస్తుందో అలాగే 75 ఏళ్లలో ఎవరూ చేయని పని తెలంగాణలో కేసీఆర్ చేశారని చెప్పారు. ప్రతీ ఇంటికి శుద్దిచేసిన తాగునీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పార్లమెంట్ లో భారత ప్రభుత్వం ప్రకటించిందన్నారు.

5 దశాబ్దులుగా తెలంగాణలో అపరిష్కతంగా ఉన్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించామన్నారు. ఉద్యమ కాలంలో మరిగూడ మండలం ఖుదాభక్ష్ పల్లి అనే ఊరులో ఫ్లోరైడ్ బాదితులను చూస్తే మనసుకు బాధ అని పించిందని గుర్తు చేశారు. 8 ఏళ్ల కిందట తెలంగాణలో పవర్ సమస్య ఎలా ఉందో ఒకసారి గుర్తు చేసుకోవాలని, పార్లమెంట్ లో భారత ప్రభుత్వం మిషణ్ భగీరథతో తెలంగాణ ఫ్లోరోసిస్ ఫ్రీ అని భారత ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఇవన్నీ దేశానికి రోల్ మోడల్ లాంటివన్నారు.

బిజెపి, ప్రధానిపై నిప్పులు….

గోల్ మాల్ గుజరాత్ మోడల్ చూపెట్టి అధికారంలోకి వచ్చి ఈ 8 ఏళ్లలో ఏం చేశారని కేటీఆర్‌ ప్రశ్నించారు. మోస్ట్ ఇన్ కాంపీటింట్ , ఇన్ ఎఫిషియంట్, ప్రచార్ మంత్రి స్వతంత్ర భారతంలో మొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని ఎద్దేవా చేశారు. దివాళాకోరు, పనికిరాని ప్రధాని మోడీ అన్నారు. ప్రధాని ప్రెస్ మీట్ పెట్టడు, జన్ కీ బాత్ వినడు. మన్ కీ బాత్ మాత్రమే చెప్తడని బిల్డప్ తప్ప పనేం లేదన్నారు.

45 సంవత్సరాల్లో అత్యధిక నిరుద్యోగం దేశంలో ఉందని, దేశంలో వికాస్ ఎక్కడ తప్పిపోయిందని అచ్చే దిన్ ఆయేంగే పతా నహీ అన్నారు. ఒక్క మనిషి కే అచ్చే దిన్ అని దునియాలోనే ధనవంతుడు అని 2022 వరకు అందరికి ఇళ్లు ఇస్తా అన్నాడని, కాని 435 కోట్లతో ప్రధానమంత్రి ఇల్లు కట్టుకుంటున్నాడని ఎద్దేవా చేశారు.

ఈ దేశంలో అత్యధిక ద్రోవ్యోల్బణం, అత్యధిక నిరుద్యోగం, ప్రపంచంలో అత్యధిక గ్యాస్ రేటు, నైజీరియాను ఇండియా పూర్ కంట్రీ అవుతోందని రిపోర్టులు వస్తున్నాయని, ఈ ప్రభుత్వం ప్రతీ రంగంలో విఫలం అయిందని ఆరోపించారు. భారత్ రాష్ట్ర సమితి రూపంలో ఈ సమస్యలకు మేం పరిష్కారం చూపిస్తామని కేటీఆర్‌ చెప్పారు. దేశంలో ప్రతీ ఒకరికి తాగునీటిని అందిస్తామని, ఉచితంగా కరెంటు అందిస్తాం. దళితులను వ్యాపారవేత్తుల చేస్తామని చెప్పారు. ఎవరు ఏం తింటున్నారు. ఎవరు ఏం ధరించాలి, అన్నవి మాత్రమే చర్చకు వస్తున్నాయని దేశంలో బిజెపి ఫెడరల్ స్పూర్తి ని దెబ్బతీసిందని ఆరోపించారు.

WhatsApp channel

టాపిక్