TG Inter Supplementary Results: తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాల విడుదల, 29వరకు రీ కౌంటింగ్‌ ఛాన్స్-telangana intermediate supplementary exam result released ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Inter Supplementary Results: తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాల విడుదల, 29వరకు రీ కౌంటింగ్‌ ఛాన్స్

TG Inter Supplementary Results: తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాల విడుదల, 29వరకు రీ కౌంటింగ్‌ ఛాన్స్

Sarath chandra.B HT Telugu
Jun 24, 2024 02:21 PM IST

TG Inter Supplementary Results: తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను బోర్డు కార్యదర్శి శృతి ఓజా విడుదల చేశారు.

ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

TG Inter Supplementary Results: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను తెలంగాణ ఇంటర బోర్డు కార్యదర్శి శృతి ఓజా విడుదల చేశారు. మే నెల 24వ తేదీ నుంచి ప్రారంభమై…జూన్ 3వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి.

ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాల్లో 1,38,477మంది సప్లిమెంటరీ పరీక్షలకు హాజరవగా 60,615మంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్షలకు హాజరైన వారిలో 43.77శాతం ఉత్తీర్ణత సాధించారు. మార్చి 2024లో ఉత్తీర్ణత సాధించిన వారితో కలిపి ఇంటర్ సెకండియర్‌లో 76.69శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఒకేషనల్ కోర్సుల్లో 15,316మంది పరీక్షలకు హజరయ్యారు. వారిలో 7737మంది ఉత్తీర్ణులయ్యారు. 51.12శాతం ఉత్తీర్ణత నమోదైంది. మార్చి 2024లో ఉత్తీర్ణతతో కలిపి ఒకేషనల్ కోర్సుల్లో 78.06శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత వాతం పెరిగింది.

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు మొదటి సంవత్సరంలో 74.1శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్‌ జనరల్‌ కోర్సుల్లో సప్లిమెంటరీ పరీక్షలకు 2,54,498మంది హాజరవగా వారిలో 1,62,520 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 82,910మంది ఏ గ్రేడ్‌లో ఉత్తీర్ణులయ్యారు. 40,143మంది బీ గ్రేడ్‌లో, 24,540మంది సి గ్రేడ్‌లో ఉత్తీర్ణులయ్యారు. 14,927మంది డిగ్రేడ్‌లో ఉత్తీర్ణులయ్యారు. మార్చిలో ఉత్తీర్ణులైన వారితో కలిపి 74.1శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఇంటర్ ఫస్టియర్ ఒకేషనల్ కోర్సుల్లో18,913మంది పరీక్షలకు హాజరవగా ఏ గ్రేడ్‌లో 3,357మంది ఏ గ్రేడ్, 6,106మంది బి గ్రేడ్, 557మంది సి గ్రేడ్, 50మంది డి గ్రేడ్‌లో ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ కోర్సుల్లో మొత్తం 53.24శాతం ఉత్తీర్ణతతో 10,070మంది ఉత్తీర్ణులయ్యారు. మార్చి2024లో ఉత్తీర్ణులై వారితో కలిపి 66.63శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఫలితాలు తెలుసుకోండి ఇలా….

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 4.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఫెయిల్ అయిన వారితో పాటు ఇంప్రూవ్ మెంట్ రాసిన వారు కూడా ఉన్నారు. వీరంతా కూడా ఫలితాలను బట్టి… ఇంజినీరింగ్ లేదా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులు https://tgbie.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. లేదా https://results.cgg.gov.in/ వెబ్ సైట్‌లోకి వెళ్లాలి.

ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ మే/జూన్ - 2024 ఫలితాలు అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

మీరు ఏ ఇయర్ పరీక్ష రాశారో అక్కడ లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి… మీ హాల్ టికెట్ నెంబర్ తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.

సబ్మిట్ బటన్ పై నొక్కితే ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.

ప్రింట్ ఆప్షన్ పై నొక్కి ఫలితాల కాపీని పొందవచ్చు. నేటి సాయంత్రం నుంచి షార్ట్‌ మెమోలను విద్యార్ధులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల రీ కౌంటింగ్ రీవెరిఫికేషన్ కోసం జూన్ 25 నుంచి 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గడువు తేదీను పొడిగించే అవకాశం లేదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. రీ కౌంటింగ్‌ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.100, రీ కౌంటింగ్‌తో పాటు రీ వెరిఫికేషన్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. ఫీజులను ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. వాటిని రిఫండ్ చేయడానికి వీలుందడని ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా తెలిపారు.

జూన్ 27 నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్….

జూన్‌ 27వ తేదీ నుంచి ఇంజినీరింగ్‌ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఏడాది మొత్తం మూడు విడతల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ జరగనుంది. జూన్‌ 30 నుంచి ఫస్ట్ ఫేజ్ వెబ్‌ ఆప్షన్లకు ఛాన్స్ కల్పించారు. జులై 12న తొలి విడత ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు. తొలి విడుతలో సీట్లు పొందిన విద్యార్థులు జూలై 16వ తేదీలోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

ఇక రెండో విడత కౌన్సెలింగ్ జులై 19వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మూడో విడత జూలై 30వ తేదీ నుంచి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. జులై 24వ తేదీన ఇంజినీరింగ్ రెండో విడత సీట్ల కేటాయింపు ఉండగా,ఆగస్టు 5వ తేదీన తుది విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయిస్తారు.

స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి ఆగస్టు 17వ తేదీన మార్గదర్శకాలను విడుదల చేస్తారు. విద్యార్థులు రిపోర్టింగ్ చేసే సంఖ్యను బట్టి మిగిలే సీట్ల విషయంలో క్లారిటీ వస్తుంది. త్వరలోనే అగ్రికల్చర్ మరియు ఫార్మసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. https://eapcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి వెబ్ ఆప్షన్ల ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు.

WhatsApp channel