రేపే తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు.. విడుదల చేయనున్న మంత్రి భట్టి విక్రమార్క.. ఫలితాలు తెలుసుకోండి ఇలా…-telangana intermediate exams 2025 results will release tomorrow by minister bhatti ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  రేపే తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు.. విడుదల చేయనున్న మంత్రి భట్టి విక్రమార్క.. ఫలితాలు తెలుసుకోండి ఇలా…

రేపే తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు.. విడుదల చేయనున్న మంత్రి భట్టి విక్రమార్క.. ఫలితాలు తెలుసుకోండి ఇలా…

Sarath Chandra.B HT Telugu

తెలంగాణ ఇంటర్మీడియట్ 2025 ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్ట విక్రమార్క మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను విడుదల చేస్తారు. ఫలితాలను తెలంగాణ ఇంటర్ బోర్డు వెబ్‌ సైట్‌లతో పాటు హిందుస్థాన్‌ టైమ్స్‌ తెలుగు వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2025

తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫస్టియర్‌,సెకండియర్‌ ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. ఫలితాలను ఆన్‌‌లైన్‌లో విడుదల చేస్తారు.మంగళవారం మధ్యాహ్నం ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేస్తారని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు.

ఈ ఏడాది తెలంగాణలో దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను https://tgbie.cgg.gov.in/ ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌తో పాటు హిందుస్థాన్ టైమ్స్‌ తెలుగు వెబ్‌సైట్‌ https://telugu.hindustantimes.com/ లో కూడా ఇంటర్‌ ఫలితాలను తెలుసుకోవచ్చు.

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్ధులు ఇప్పటికే ఫలితాల కోసం వేచి చూస్తున్నారు.ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు ఇప్పటికే విడుదల అయ్యాయి. దీంతో తెలంగాణ విద్యార్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్‌ 22న ఫలితాల విడుదల చేయనున్నట్లు ఇంటర్‌ బోర్డ్‌ ప్రకటన విడుదల చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.

ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేస్తారు. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఏప్రిల్‌ 22వ తేదీ మంగళవారం మధ్యాహ్నం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య సహా అధికారులు పాల్గొంటారు.

ఇంటర్ ఫలితాలు నేరుగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://tgbie.cgg.gov.in/ లో అందుబాటులో ఉంటాయి. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్ధులు తమ హాల్‌ టికెట్ నెంబర్ , పుట్టిన తేదీ ఎంటర్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

తెలంగాణలో ఈ ఏడాది మార్చి 5 నుంచి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1532 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్‌ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 9,96,971 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.ఇంటర్‌ పరీక్షలు రాసిన వారిలో 4.88 లక్షల మంది ఫస్టియర్ విద్యార్థులు ఉండగా.. 5 లక్షలకు మంది సెకండియర్ విద్యార్థులు ఉన్నారు.

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలను తెలుసుకోండి ఇలా…

తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలను హిందుస్తాన్ టైమ్స్‌ ద్వారా అందరి కంటే ముందు తెలుసుకోవచ్చు. ఫలితాల కోసం ఈ లింకులను అనుసరించండి.

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ 2025 ఫలితాల లింక్ :

https://telugu.hindustantimes.com/telangana-board-inter-first-year-result

తెలంగాణ ఇంటర్ సెకండియర్ 2025 ఫలితాల లింక్ :

https://telugu.hindustantimes.com/telangana-board-inter-second-year-result

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ వొకేషనల్ ఫలితాల లింక్ :

https://telugu.hindustantimes.com/telangana-board-inter-first-year-voc-result

తెలంగాణ ఇంటర్ సెకండియర్ 2025 వొకేషనల్ ఫలితాల లింక్ :

https://telugu.hindustantimes.com/telangana-board-inter-second-year-voc-result

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం