TS Inter Results 2023 : ఇంటర్ ఫలితాలపై కసరత్తు...రిజల్ట్స్ ఎప్పుడంటే..?
TS Inter Results 2023 Updates: తెలంగాణ ఇంటర్ ఫలితాల వాల్యూయేషన్ షురూ అయింది. సాధ్యమైనంత వరకు వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి చేసి.... మే మొదటి వారంలోనే ఫలితాలను చేయాలని భావిస్తోందని తెలుస్తోంది.
TS Inter Results 2023: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు పూర్తి అయ్యాయి. 9 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలు హాజరుకాగా...ఫలితాలపై ఫోకస్ పెట్టారు అధికారులు. ఇప్పటికే వాల్యూయేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. గత వారంలోనే షురూ చేయగా.... సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. ఎంసెట్ తో పాటు ఇతర పరీక్షల దృష్ట్యా.... వీలైనంత త్వరగా వాల్యూయేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని చూస్తోంది. అన్నీ కుదిరితే మే మొదటి వారంలోనే ఇంటర్ ఫలితాలను విడుదల చేసే దిశగా కసరత్తు చేస్తోంది.
ఫస్ట్ ఇయర్, సెకండియర్ కలిపి దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. సెకండియర్ కు సంబంధించి పరీక్షలకు గాను మొత్తం 4,02,630 మంది హాజరయ్యారు. మొదటి సంవత్సరానికి సంబంధించి 4,82,619 మంది ఉన్నారు. ఇక ఎంసెట్, నీట్, JEE తదితర ప్రవేశ పరీక్షలకు ప్రిపెర్ అయ్యే పనిలో పడ్డారు.
TS EAMCET 2023 Exam Dates: తెలంగాణ ఎంసెట్ 2023 పరీక్ష తేదీలు మారాయి. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు. నీట్, టీఎస్పీఎస్సీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు మే 7 నుంచి 11 వరకు జరగాల్సి ఉంది. అయితే మారిన షెడ్యూల్ ప్రకారం మే 12, 13, 14 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు.ఈ మేరకు ఉన్నత విద్యామండలి కార్యదర్శి డా. ఎన్. శ్రీనివాసరావు ఓ ప్రకటనలో వెల్లడించారు.
మే 7న నీట్ (యూజీ) పరీక్ష, మే 7, 8, 9 తేదీల్లో టీఎస్పీఎస్సీ పరీక్షలు ఉండటంతో ఈ మార్పులు చేసినట్టు పేర్కొన్నారు. ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ల షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. మే 10, 11 తేదీల్లోనే ఈ పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని తెలిపారు. ఎంసెట్ దరఖాస్తుల గడువు ఏప్రిల్ 4తో ముగియనుంది. ఆలస్య రుసుముతో మే 2 వరకు ఎంసెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 30 నుంచి ఎంసెట్ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
ముఖ్య వివరాలు:
ఫిబ్రవరి 28న నోటిఫికేషన్ విడుదల.
మార్చి 3 నుండి ఆన్లైన్ అప్లికేషన్స్ స్వీకరణ.
ఆన్లైన్ అప్లికేషన్ స్వీకరణకి చివరి తేదీ ఏప్రిల్ 10.
ఏప్రిల్ 12 నుండి 14 వరకు ఎడిట్ చేసుకునే అవకాశం.
ఏప్రిల్ 30 నుండి ఆన్లైన్ లో ఎంసెట్ హల్ టికెట్స్ జారీ.
మే 29 నుండి జూన్ 1 వరకు ఎంసెట్ పరీక్షలు
మే 12,13, 14 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు.
మే 10,11న అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షలు.
ఉదయం 9 నుండి 12 వరకు మొదటి సెషన్ పరీక్ష, మధ్యాహ్నం 3 నుండి 6 వరకు రెండవ సెషన్ పరీక్ష ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఎంసెట్ ఫీజు 500 రూపాయలు.
ఇతర విద్యార్థులకు ఎంసెట్ ఫీజు 900 రూపాయలు.
ఈసారి ఎంసెట్ ద్వారా నే బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్స్
ఈసారి ఎంసెట్ లో ఇంటర్ వెయిటేజీ లేదు.
సంబంధిత కథనం