TS Inter 2nd Year Results 2024 : తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల, ఇక్కడ చెక్ చేసుకోండి!
TS Inter 2nd Year Results 2024 : తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు హెచ్.టి.తెలుగులో వేగంగా ఫలితాలు తెలుసుకోవచ్చు.

TS Inter 2nd Year Results 2024 : తెలంగాణ ఇంటర్ సెకండియర్(జనరల్, ఒకేషనల్) ఫలితాలు(TS Inter 2nd Year Results 2024) విడుదలయ్యాయి. బుధవారం ఉదయం 11 గంటలకు ఇంటర్ బోర్డు అధికారులు ఫలితాలు విడుదల చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 29 నుంచి మార్చి 19 సెకండియర్ పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు(Telangana Intermediate Board) అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. అలాగే హెచ్.టి. తెలుగు వెబ్ సైట్ లో సింగిల్ క్లిక్ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఇంటర్ బోర్డు ఫలితాలును ttps://telugu.hindustantimes.com/telangana-board-result లింక్ పైసింగిల్ క్లిక్ లో చెక్ చేసుకోవచ్చు. విద్యార్థులు ఈ కింది మీ ఫలితాల లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్ నంబర్ ను ఎంటర్ చేయాలి. సబ్మిట్ బటన్ నొక్కితే మీ మార్కుల జాబితా స్క్రీన్ పై కనిపిస్తుంది. ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మార్కుల మెమో కాపీని పొందవచ్చు. ఇంటర్ సెకండియర్ ఉత్తీర్ణత 64.19 శాతం. ఇంటర్ మార్కుల మెమోలను ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి బోర్డు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు.
ఇంటర్ సెకండియర్ పరీక్షలకు 5.02 లక్షల మంది హాజరు కాగా 3.22 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. 72.53 శాతం పాస్ పర్సంటేజ్ తో బాలికలదే సెకండియర్ లో కూడా పై చేయి. ఇంటర్ సెకండియర్ లో 1.79 లక్షల మంది బాలికలు, 1.43 లక్షల మంది బాలురు పాస్ అయ్యారు. సెకండియర్ ఫలితాల్లో ములుగు టాప్ లో ఉండగా, కామారెడ్డి చివరి స్థానంలో ఉంది.
- ములుగు జిల్లా - 82.95 శాతం
- మేడ్చల్ జిల్లా - 79.31 శాతం
- రంగారెడ్డి జిల్లా - 77.63 శాతం
- కరీంనగర్ జిల్లా - 74.39 శాతం
- ఖమ్మం జిల్లా - 74.2 శాతం
ఇంటర్ సెకండియర్ మార్కులు(TS Inter 2nd year Marks)
ఇంటర్ సెకండియర్ ఒకేషనల్ మార్కులు (Ts Inter Voc 2nd Year Marks)
తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాల లింక్ (TS Inter 2nd Year Results):
https://telugu.hindustantimes.com/telangana-board-inter-second-year-result-2024
తెలంగాణ ఇంటర్ ఒకేషనల్ సెకండియర్ ఫలితాల లింక్(TS Inter Voc 2nd Year Results) :
https://telugu.hindustantimes.com/telangana-board-inter-second-year-voc-result-2024
సంబంధిత కథనం