TS Inter Exams : ఇంటర్ పరీక్షలకు మంగళవారం 15,700 మంది డుమ్మా-telangana inter exams over 15700 students skip intermediate second year exams on tuesday details inside ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Inter Exams Over 15700 Students Skip Intermediate Second Year Exams On Tuesday Details Inside

TS Inter Exams : ఇంటర్ పరీక్షలకు మంగళవారం 15,700 మంది డుమ్మా

HT Telugu Desk HT Telugu
Mar 21, 2023 07:17 PM IST

Inter Exam Absent : ఇంటర్ వార్షిక పరీక్షకు భారీ సంఖ్యలో విద్యార్థులు డుమ్మా కొడుతున్నారు. మంగళవారం(21-03-2023) ఒక్క రోజు 15,700 గైర్హాజరయ్యారు

తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల (unsplash)

ఇంటర్‌ వార్షిక పరీక్షలకు భారీ సంఖ్యలో విద్యార్థులు డుమ్మా కొడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం (గణితం పేపర్-IIA, బోటనీ పేపర్-II మరియు పొలిటికల్ సైన్స్ పేపర్-II) పరీక్షకు 15,700 మందికి పైగా మంగళవారం గైర్హాజరయ్యారు. మొత్తం 4,44,384 మంది అభ్యర్థులకు గానూ.. 4,28,664 మంది హాజరు అయ్యారు.  3.5 శాతం మంది గైర్హాజరయ్యారు.

ట్రెండింగ్ వార్తలు

పరీక్ష సమయంలో నల్గొండలో రెండు, వనపర్తి జిల్లాలో మూడు మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. పరీక్షను పర్యవేక్షించేందుకు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టీఎస్ బీఐఈ) నల్గొండ, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్, హైదరాబాద్ జిల్లాలకు పరిశీలకులను పంపింది .

ఇంటర్ వార్షిక పరీక్షలకు ఈ ఏడాది ఎక్కువగా డుమ్మా కొడుతున్నారు. గత శుక్రవారం ఒక్కరోజే 20,259 మంది ఫస్టియర్‌ విద్యార్థులు ఇంగ్లిష్‌ పరీక్షకు గైర్హాజరయ్యారు. మొత్తం 5,02,018 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.., 4,81,759 మంది విద్యార్థులే పరీక్ష రాశారు.

జరగాల్సిన ఇంట‌ర్‌ ఫస్టియర్ ఎగ్జామ్స్ షెడ్యూలు :

మార్చి 23 - మ్యాథ్స్ 1బి, హిస్టరీ పేపర్ 1, జువాలజీ పేపర్ 1

మార్చి 25 - ఫిజిక్స్ పేపర్ 1, ఎకనావిుక్స్‌ పేపర్ 1

మార్చి 28 - కెవిుస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1

మార్చి 31 - పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌ పేపర్ 1 (బైపీసీ విద్యార్థులకు)

ఏప్రిల్ 3 - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫీ పేపర్ 1

జరగాల్సిన ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ షెడ్యూల్

మార్చి 24 - మ్యాథ్స్ పేసర్ 2బి, హిస్టరీ పేపర్‌ 2, జువాలజీ పేపర్‌ 2

మార్చి 27 - ఫిజిక్స్ పేపర్‌ 2, ఎకనావిుక్స్‌ పేపర్‌ 2

మార్చి 29 - కెవిుస్ట్రీ పేపర్‌ 2, కామర్స్ పేపర్‌ 2

ఏప్రిల్ 1 - పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్ పేపర్‌ 2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌ పేపర్‌ 2 (బైపీసీ విద్యార్థులకు)

ఏప్రిల్ 4 - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్‌ 2, జియోగ్రఫీ పేపర్‌ 2

IPL_Entry_Point

సంబంధిత కథనం