TS HC Exam Dates: హైకోర్టు ఉద్యోగ పరీక్ష తేదీలు విడుదల.. ఏ ఎగ్జామ్ ఎప్పుడంటే -telangana high court jobs exam dates announced full details are here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana High Court Jobs Exam Dates Announced Full Details Are Here

TS HC Exam Dates: హైకోర్టు ఉద్యోగ పరీక్ష తేదీలు విడుదల.. ఏ ఎగ్జామ్ ఎప్పుడంటే

HT Telugu Desk HT Telugu
Feb 22, 2023 02:02 PM IST

Telangana High Court Recruitment:తెలంగాణలో హైకోర్టులోని పలు ఉద్యోగాల రాత పరీక్షకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. రాత పరీక్ష తేదీలను ప్రకటిస్తూ ప్రకటన విడుదలైంది.

తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలు
తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలు (ts hc )

Telangana High Court Recruitment Exam Dates: తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా నడుస్తోంది. ఓవైపు భారీగా నోటిఫికేషన్లు రాగా... మరికొన్ని వాటికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇదే సమయంలో పలు పరీక్షల తేదీలు కూడా ఖరారు అయ్యాయి. అయితే తాజాగా తెలంగాణ హైకోర్టులోని పలు ఉద్యోగాల రాత పరీక్షకు సంబంధించిన డేట్స్ కూడా వచ్చేశాయి. ఈ మేరకు ఓ ప్రకటన విడుదలైంది. ఎగ్జామ్ తేదీలు, టైమింగ్స్ ను వెల్లడించారు. ఆ వివరాలు చూస్తే....

ట్రెండింగ్ వార్తలు

గతేడాది చివర్లో తెలంగాణ హైకోర్టులోని పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో అసిస్టెంట్, ఎగ్జామినర్, సిస్టమ్ అసిస్టెంట్, ట్రాన్స్లేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, కంప్యూటర్ ఆపరేటర్ తదితర పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి మార్చి 31న పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.

ఇక ఎగ్జామినర్ పోస్టలకు సంబంధించిన రాత పరీక్షను మార్చి 31న ఉంటుంది. మధ్యాహ్నం 12.30 నుంచి 2.00 గంటల వరకు నిర్వహిస్తారు. సిస్టమ్ అసిస్టెంట్ నియామక పరీక్ష కూడా మార్చి 31వ తేదీనే ఉండగా సాయంత్రం 4 గంటల నుంచి 5.30 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటనలో వెల్లడించారు. ట్రాన్స్ లేటర్(అనువాదకులు), అసిస్టెంట్ లైబ్రేరియర్, కంప్యూటర్ ఆపరేటర్ నియామక పరీక్షను ఏప్రిల్ ఒకటో తేదీన ఖరారు చేశారు. ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది.

హాల్ టికెట్లు ఎప్పుడంటే...

ఆయా రాత పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను మార్చి 23వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుది.

అభ్యర్థులు ఈ https://tshc.gov.in/getRecruitDetails లింక్ పై క్లిక్ చేసి ఇతర అప్డేట్స్ తో పాటు హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ చేసుకునే వీలు ఉంటుంది.

హైకోర్టు ఉద్యోగ నోటిఫికేషన్ లో భాగంగా అప్పర్ డివిజన్ స్టెనో-2, అసిస్టెంట్ లైబ్రేరియన్-2, కంప్యూటర్ ఆపరేటర్-20, ట్రాన్స్‌లేటర్-10, కోర్టు మాస్టర్స్/ హైకోర్టు జడ్జిల వ్యక్తిగత కార్యదర్శి-20, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 50 పోస్టులు, అసిస్టెంట్ పోస్టులు 10, ఎగ్జామినర్ పోస్టులు 17, సిస్టమ్ అసిస్టెంట్-45 పోస్టులను భర్తీ చేస్తారు. ఇవే కాకుండా డ్రైవర్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన తేదీలు కూడా త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక జిల్లా కోర్టుల్లోని ఉద్యోగ రాత పరీక్ష తేదీలు కూడా త్వరలోనే ప్రకటించే ఛాన్స్ ఉంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం