BJP Nirudyoga Maha Dharna: బీజేపీ ‘నిరుద్యోగ మహాధర్నా’.. 500 మందికి మాత్రమే అనుమతి
BJP Maha Dharna at Indira Park: శనివారం బీజేపీ ఆధ్వర్యంలో ‘‘నిరుద్యోగ మహాధర్నా’’ దీక్ష జరగనుంది. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇందిరాపార్క్ ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈ దీక్ష కొనసాగుతుంది.
BJP Nirudyoga Maha Dharna in Hyderabad: టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీకి నిరసనగా బీజేపీ పోరాటాన్ని ఉద్ధృతం చేసే పనిలో పడింది. ఇప్పటికే మంత్రి కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్... ఇప్పటికే సిట్ నోటీసులు అందాయి. అయితే ఆయన సిట్ విచారణకు హాజరుకాలేదు. ఇదిలా ఉంటే.... ‘‘మా నౌకరీలు మాగ్గావాలే’’ నినాదంతో దీక్షను చేపట్టేందుకు సిద్ధమైంది బీజేపీ. శనివారం (మార్చి 25) రోజు ఇందిరాపార్క్ వేదికగా ‘‘నిరుద్యోగుల మహాధర్నా’’ను చేపట్టనుంది. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో... ఈ దీక్ష జరగనుంది.
హైకోర్టు అనుమతి...
బీజేపీ తలపెట్టిన ఈ దీక్షకు పోలీసుల నుంచి అనుమతి లభించలేదు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర బీజేపీ వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై శుక్రవారం ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. దీక్షకు అనుమతి ఇచ్చిన కోర్టు... పలు ఆంక్షలను పాటించాలని స్పష్టం చేసింది. 500 మందితో మాత్రే ధర్నా చేయాలని స్పష్టం చేసింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని సూచించింది. సాయంత్రం 4 గంటలకు ధర్నా పూర్తి చేయాలని చెప్పింది. ఈ సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ధర్నా చౌక్ వద్ద అనుమతి ఇవ్వకపోతే ప్రజలు ధర్నా ఎక్కడ చేసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిరసన తెలిపే హక్కు ప్రజలకు రాజ్యాంగం కల్పించిందని గుర్తు చేసింది. ధర్నాకు తగిన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది.
TSPSC Paper Leak Case Updates: మరోవైపు టీఎస్పీఎస్పీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు విచారణలో తవ్వే కొద్దే అక్రమాలు బయటికి వస్తున్నాయి. ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేయగా... తాజాగా మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుంది సిట్. ఇప్పటికే కీలక ఆధారాలను సేకరించిన పోలీసులు... రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను ప్రస్తావించారు.
పేపర్ లీకేజీకి సంబంధించి ఇప్పటికి వరకు 12 మంది నిందితులను ఆరెస్ట్ చేసినట్టు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది సిట్. తొమ్మిది మంది నిందితులతో పాటు మరో ముగ్గురు అరెస్ట్ చేయగా... ఇందులో ఇద్దరు TSPSC ఉద్యోగులు ఉన్నట్లు ప్రస్తావించింది. ఇప్పటివరకు మొత్తం నలుగురు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగుల అరెస్ట్ కాగా... నిందితుల్లో మరో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు వెల్లడించింది. 19 మంది సాక్ష్యుల ను విచారించినట్టు రిమాండ్ రీపోర్ట్ లో స్పష్టం చేసింది.
టీఎస్పీఎస్సీ ఉద్యోగి శంకర్ లక్ష్మి ని ప్రధాన సాక్షి గా పేర్కొంది సిట్. శంకర్ లక్ష్మి తో పాటు టీఎస్పీఎస్సీ , తెలంగాణ స్టేట్ టెక్నీకల్ సర్వీస్ ఉద్యోగులను సాక్షులు గా నమోదు చేసింది. కర్మన్ ఘాట్ లోని ఒక హోటల్ లోని యాజమని, ఉద్యోగిని కూడా సాక్షి గా ప్రస్తావించింది. హోటల్ లోని సీసీటీవి కెమెరాలో నిక్షిప్తమైన పేపర్ ఎక్సెంజ్ వ్యవహారాన్ని నిక్షిప్తం చేసింది. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు షమీమ్, రమేష్, సురేష్ లను ఆరెస్ట్ చేసినట్లు ప్రకటించగా... ముగ్గురు నిందితుల నుండి ఒక ల్యాప్ టాప్ మూడు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది. మరోవైపు తాజాగా గురువారం అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులను ఏడు రోజుల కస్టడీకి కోరింది సిట్. మరోవైపు ప్రస్తుతం అరెస్ట్ చేసిన వారిలో చూస్తే… A1గా ప్రవీణ్ , A2 గా నెట్వర్క్ అడ్మిన్ రాజశేఖర్ రెడ్డి, A10గా ఏఎస్వో షమీమ్, A12గా డేటా ఎంట్రీ ఆపరేటర్ రాజశేఖర్ ఉన్నారు. ఇక ఏ3గా రేణుకా రాథోడ్, ఏ4గా ఢాక్యా నాయక్, ఏ5గా కోటేశ్వర్, ఏ6గా నిలేష్ నాయక్ పేర్లను ప్రస్తావించింది సిట్.
సంబంధిత కథనం