TS High Court Jobs 2024 : తెలంగాణ హైకోర్టు నుంచి 150 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - దరఖాస్తులకు ఇవాళే చివరి తేదీ
TS High Court Recruitment 2024 Updates: తెలంగాణ హైకోర్టు 150 సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల గడువు ఇవాళ్టితో(మే 17) పూర్తి కానుంది.
Telangana High Court Civil Judge Jobs 2024 : సివిల్ జడ్జి ఉద్యోగాల భర్తీకి తెలంగాణ హైకోర్టు ఇటీవలే నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 18వ తేదీ నుంచే ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే అప్లికేషన్ల గడువు ఇవాళ్టితో (మే 17) పూర్తి కానుంది. అర్హులైన అభ్యర్థులు https://tshc.gov.in/getRecruitDetails వెబ్ సైట్ లోకి అప్లయ్ చేసుకోవచ్చు.
తాజా నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 150 సివిల్ జడ్జి పోస్టులను భర్తీ చేయనున్నారు. జూన్ 16వ తేదీన అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్(కంప్యూటర్ ఆధారిత పరీక్ష) ఉంటుంది. ఇందులో అర్హత సాధిస్తే… మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేస్తారు. ఇది 1:10గా ఎంపిక ఉంటుంది.
ముఖ్య వివరాలు :
- ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటన - తెలంగాణ హైకోర్టు
- ఉద్యోగాలు - సివిల్ జడ్జి
- మొత్తం ఖాళీలు - 150(ఇందులో కొన్ని డైరెక్ట్ రిక్రూట్ మెంట్, మరికొన్ని ట్రాన్స్ ఫర్ రిక్రూట్ మెంట్)
- అర్హతలు - గుర్తింపు పొందిన వర్శిటీ నుంచి లా డిగ్రీ పొంది ఉండాలి. తెలంగాణ జ్యుడీషియల్ రూల్స్ 2023 ప్రకారం నిర్ధేశించిన అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. ఈ ఈ వివరాలను నోటిఫికేషన్ లో చూడొచ్చు.
- దరఖాస్తు విధానం - ఆన్ లైన్
- దరఖాస్తులు ప్రారంభం - ఏప్రిల్ 18, 2024.
- దరఖాస్తులకు చివరి తేదీ - మే 17, 2024.
- ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది.
- ఎస్సీ, ఎస్టీ, ఈడబ్య్లూఎస్ అభ్యర్థులు రూ. 500 చెల్లించాలి.
- హాల్ టికెట్లు - 08 జూన్ 2024.
- స్క్రీనింగ్ టెస్ట్(కంప్యూటర్ ఆధారిత పరీక్ష) - 16 జూన్ 2024.
- 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.
- సమయం - 2 గంటలు కేటాయిస్తారు.
- స్క్రీనింగ్ టెస్టులో అర్హత సాధిస్తే… మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేస్తారు. 1.10గా ఎంపిక ఉంటుంది.
- స్క్రీనింగ్ టెస్ట్ కోసం హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం నగరాలను ఎగ్జామ్ సెంటర్లుగా ఎంపిక చేశారు.
- మెయిన్స్ పరీక్షల్లో మూడు పేపర్లు ఉంటాయి. సివిల్ లా, క్రిమినల్ లాతో పాటు ట్రాన్స్ లేషన్ విభాగం నుంచి ప్రశ్నలు ఉంటాయి.
- ప్రతి పేపర్ కు 100 మార్కులు కేటాయిస్తారు.
- ఇంగ్లీష్ లోనే పరీక్ష ఉంటుంది.
- చివరగా వైవా కూడా ఉంటుంది. ఇందుకు 1.3గా ఎంపిక ఉంటుంది.
- ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెల జీతం రూ. 77,840 - రూ. 1,36,520 వరకు ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ - https://tshc.gov.in/getRecruitDetails
- అప్లికేషన్ ఫారమ్ కోసం లింక్ - https://cdn3.digialm.com/EForms/configuredHtml/2775/87826/Registration.html
హైకోర్టు నుంచి మరో నోటిఫికేషన్ - ముఖ్య తేదీలివే
తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ(Telangana Judicial Services) నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా తొమ్మిది జిల్లా జడ్జీల (ఎంట్రీ లెవెల్) పోస్టులను భర్తీ చేయనుంది. మే14వ తేదీ నుంచి ఆఫ్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. జూన్ 13వ తేదీని తుది గడువుగా ప్రకటించారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలు ఆగస్టు 24, 25 తేదీల్లో నిర్వహించనున్నారు. గుర్తింపు పొందిన వర్శిటీ నుంచి ఎల్ఎల్ బీ పూర్తి చేసి ఉండాలి. అంతేకాకుండా తెలంగాణ జ్యుడీషియల్ నియమ నిబంధనల ప్రకారం నిర్దేశించిన అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. అర్హులైన వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం https://tshc.gov.in/ వెబ్ సైట్లోకి వెళ్లాలి.