TS Health Department: తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్... రూ.3 వేల స్కాన్ ఇక 'ఫ్రీ'-telangana health department innagurated 56 tiffa scan machines in 44 govt hospitals ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Health Department Innagurated 56 Tiffa Scan Machines In 44 Govt Hospitals

TS Health Department: తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్... రూ.3 వేల స్కాన్ ఇక 'ఫ్రీ'

HT Telugu Desk HT Telugu
Nov 26, 2022 07:07 PM IST

TIFFA Scan Machines in Telangana: గర్భిణీల కోసం 56 అత్యాధునిక ‘టిఫా’ స్కానింగ్‌ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది తెలంగాణ సర్కార్. రాష్ట్రవ్యాప్తంగా 44 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ సేవలను ప్రారంభించింది.

తెలంగాణలో ఉచితంగా టిఫా కేంద్రాలు
తెలంగాణలో ఉచితంగా టిఫా కేంద్రాలు

TS Govt Innagurated TIFFA Scan Machines: ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేస్తోంది తెలంగాణ సర్కార్. ఇప్పటికే రోగుల కోసం పలు పథకాలను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తల్లీబిడ్డల సంరక్షణ కోసం మరో అడుగు ముందుకేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 'టిఫా'(Targeted Imaging for Fetal Anomalies) స్కానింగ్ సెంటర్లు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో 44 గవర్నమెంట్ ఆస్పత్రుల్లో 56 అత్యాధునిక టిఫా స్కానింగ్ సెంటర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావ్ ప్రారంభించారు.

ట్రెండింగ్ వార్తలు

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావ్ మాట్లాడారు. 44 ఆస్పత్రుల్లో 56 టిఫా యంత్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఏ రోజు అయితే కేసీఆర్ కిట్ ప్రారంభించామో... అదేరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు. 2 నెలల కింద పేట్లబురుజు ఆస్పత్రి సందర్శించిన సమయంలో టిఫా సేవల విషయంలో గర్భిణీ స్త్రీలు ఇబ్బందిపడుతున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. వెంటనే రూ. 20 కోట్లతో 56 టిఫా స్కానింగ్ యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చామని వెల్లడించారు. వందకు 7 శాతం మంది శిశువుల్లో లోపాలు ఉంటున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయని.. అటువంటి లోపాలను ఈ టిఫా స్కానింగ్ సేవలతో గుర్తించవచ్చని చెప్పారు. ఒక్కో యంత్రంతో ప్రతి నెల 20 వేల మందికి సేవలు అందిచవచ్చని చెప్పారు. బయట ప్రైవేటు ఆస్పత్రుల్లో 3 నుంచి 5 వేలకు ఈ స్కానింగ్ కు ఖర్చు అవుతుందని...ఇది గర్భిణీ స్త్రీలకు భారంగా మారిందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ సేవలను ఉచితంగా పొందవచ్చని వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా టీ డయాగ్నోస్టిక్ సెంటర్లలో ఫ్రీగా 57 రకాల పరీక్షలు చేస్తున్నామని మంత్రి హరీశ్ రావ్ చెప్పారు. వైద్య రంగంలో మూడంచెల వ్యవస్థతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. అమ్మఒడి వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. కేసీఆర్ కిట్ అందజేస్తున్నామని... ఇప్పటివరకు 12 లక్షల మందికిపైగా ఇచ్చామని వివరించారు. నార్మల్ డెలివరీల సంఖ్యను కూడా పెంచే దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి అన్నారు.

WhatsApp channel