తెలుగు న్యూస్ / తెలంగాణ /
TG Public Holidays 2025 : 2025 సెలవుల జాబితా విడుదల చేసిన తెలంగాణ సర్కార్, మొత్తం ఎన్ని సెలవులంటే?
TG Public Holidays 2025 : తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఏడాది 2025కి సంబంధించిన సెలవుల జాబితాను విడుదల చేసింది. 2025లో మొత్తం 27 సాధారణ సెలవులు, 23 ఐచ్ఛిక సెలవులు ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
2025 సెలవుల జాబితా విడుదల చేసిన తెలంగాణ సర్కార్, మొత్తం ఎన్ని సెలవులంటే?
TG Public Holidays 2025 : వచ్చే సంవత్సరం 2025కు సాధారణ, ఆప్షనల్ సెలవులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాదిలో మొత్తం 27 సాధారణ సెలవులు, 23 ఐచ్ఛిక సెలవులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
సాధారణ సెలవులు - 2025
- న్యూ ఇయర్ డే : 01-01-2025(బుధవారం)
- భోగి : 13-01-2025(సోమవారం)
- సంక్రాంతి : 14-01-2025(మంగళవారం)
- రిపబ్లిక్ డే : 26-01-2025(ఆదివారం)
- మహా శివరాత్రి : 26-02-2025(బుధవారం)
- హోలీ : 14-03-2025(శుక్రవారం)
- ఉగాది : 30-03-2025(ఆదివారం)
- ఈద్ ఉల్ ఫిత్ర్ (రంజాన్) : 31-03-2025(సోమవారం)
- రంజాన్ తరువాతి రోజు : 01-04-2025(మంగళవారం)
- బాబు జగ్జీవన్ రామ్ జయంతి : 05-04-2025(శనివారం)
- శ్రీరామ నవమి : 06-04-2025(ఆదివారం)
- డి.ఆర్.బి.ఆర్. అంబేద్కర్ జయంతి -14-04-2025(సోమవారం)
- గుడ్ ఫ్రైడే : 18-04-2025(శుక్రవారం)
- ఈదుల్ అజా (బక్రీద్) : 07-06-2025(శనివారం)
- మొహరం : 06-07-2025(ఆదివారం)
- బోనాలు : 21-07-2025(సోమవారం)
- స్వాతంత్ర్య దినోత్సవం : 15-08-2025(శుక్రవారం)
- శ్రీ కృష్ణాష్టమి : 16-08-2025(శనివారం)
- వినాయక చవితి : 27-08-2025(బుధవారం)
- ఈద్ మిలాదున్ నబీ : 05-09-2025(శుక్రవారం)
- బతుకమ్మ పండుగ ప్రారంభ రోజు : 21-09-2025 (ఆదివారం)
- మహాత్మా గాంధీ జయంతి/విజయ దశమి : 02-10-2025(గురువారం)
- విజయ దశమి తరువాతి రోజు : 03-10-2025(శుక్రవారం)
- దీపావళి : 20-10-2025(సోమవారం)
- కార్తీక పూర్ణిమ/ గురునానక్ జయంతి : 05-11-2025(బుధవారం)
- క్రిస్మస్ తరువాతి రోజు : 25-12-2025(గురువారం)
- క్రిస్మస్ (బాక్సింగ్ డే) : 26-12-2025(శుక్రవారం)
ఐచ్ఛిక సెలవులు-2025
- హజ్రత్ అలీ పుట్టినరోజు (సంక్రాంతి దృష్ట్యా సాధారణ సెలవుదినం) : 14-01-2025(మంగళవారం)
- కనుము : 15-01-2025(బుధవారం)
- షాబ్-ఇ-మెరాజ్ : 28-01-2025(మంగళవారం)
- శ్రీ పంచమి : 03-02-2025(సోమవారం)
- షబ్-ఎ-బరాత్ : 14-02-2025(శుక్రవారం)
- షాహదత్ HZT అలీ : 21-03-2025(శుక్రవారం)
- జుమాతుల్ వాడ / షాబ్-ఇ-ఖాదర్ : 28-03-2025(శుక్రవారం)
- మహావీర్ జయంతి : 10.04.2025(గురువారం)
- తమిళ నూతన సంవత్సర దినోత్సవం (డా. బి.ఆర్. అంబేడ్కర్ జయంతి దృష్ట్యా సాధారణ సెలవుదినం) : 14-04-2025(సోమవారం)
- బసవ జయంతి : 30-04-2025(బుధవారం)
- బుద్ధ పూర్ణిమ : 12-05-2025(సోమవారం)
- ఈద్-ఎ-గదీర్ : 15-06-2025 (ఆదివారం)
- రథ యాత్ర : 27-06-2025(శుక్రవారం)
- 9వ మొహర్రం : 05-07-2025(శనివారం)
- వరలక్ష్మీ వ్రతం : 08-08-2025(శుక్రవారం)
- శ్రావణ పూర్ణిమ/రాఖీ పూర్ణిమ : 09-08-2025(శనివారం)
- పార్సీ నూతన సంవత్సర దినోత్సవం/Arbayeen(స్వాతంత్ర్య దినోత్సం దృష్ట్యా సాధారణ సెలవు) : 15.08.2025(శుక్రవారం)
- దుర్గాష్టమి : 30.09.2025(మంగళవారం)
- మహర్నవమి : 01-10-2025(బుధవారం)
- యాజ్ దహుమ్ షరీఫ్ : 04-10-2025(శనివారం)
- నరక చతుర్ధి : 19-10-2025(ఆదివారం)
- HZT . సయ్యద్ మహ్మద్ జువాన్‌పురి మహదీ మౌద్ జయంతి : 16-11-2025 (ఆదివారం)
- క్రిస్మస్ ఈవ్ : 24-12-2025(బుధవారం)
సంబంధిత కథనం