TS Govt Reels Contest : సోషల్ మీడియాలో రీల్స్ చేసేవారికి గుడ్ న్యూస్, రూ.75 వేలు గెలుచుకునే ఛాన్స్!-telangana govt reels contest for drugs abolish awareness in youth police department will give 75k for winner ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Govt Reels Contest For Drugs Abolish Awareness In Youth Police Department Will Give 75k For Winner

TS Govt Reels Contest : సోషల్ మీడియాలో రీల్స్ చేసేవారికి గుడ్ న్యూస్, రూ.75 వేలు గెలుచుకునే ఛాన్స్!

Bandaru Satyaprasad HT Telugu
May 29, 2023 06:36 PM IST

TS Govt Reels Contest : సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్ వీడియోస్ ఎంత ఫేమస్ చెప్పనవసరంలేదు. ఈ కాన్సెప్ట్ తో డ్రగ్స్ వాడకంపై దుష్ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ సర్కార్ ఓ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఈ పోటీలో గెలిచిన వారికి రూ.75 వేల బహుమతి అందజేయనుంది.

రీల్స్ కాంటెస్ట్
రీల్స్ కాంటెస్ట్

TS Govt Reels Contest : ప్రస్తుత జనరేషన్ పై సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువ. యూట్యూబ్, ఇన్ స్టా, ఫేస్ బుక్, షేర్ చాట్ అంటూ సోషల్ ప్రపంచంలో యువత విహరిస్తోంది. వయసులో సంబంధంలో లేకుండా అందరూ సోషల్ మీడియాకు అతక్కుపోతున్నారు. వీలైతే వీడియోలు లేకపోతే రీల్స్, షార్ట్స్ తో పాపులర్ అయ్యేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. వీటిల్లో ఇన్ స్టా రీల్స్ గురించి ప్రత్యేకించి చెప్పాలి. ఇన్ స్టా రీల్స్ చేస్తూ పాపులర్ అయిన యువత చాలా మంది ఉన్నారు. ఒక్క వైరల్ వీడియో పడితే చాలు రాత్రికి రాత్రే స్టార్ డమ్ వస్తుందన్న ఆలోచనతో చాలా మంది కొత్త ఐడియాలతో సరికొత్త వీడియోలు సృష్టిస్తున్నారు. అయితే రీల్స్ చేసే వారికి తెలంగాణ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం యువత ఎక్కువగా చూస్తున్న రీల్స్ ను వినియోగించుకుని డ్రగ్స్ పై అవగాహన కల్పించేందుకు సరికొత్త ఆలోచన చేసింది.

ట్రెండింగ్ వార్తలు

డ్రగ్స్ దుష్పరిణామాలపై రీల్స్

తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ వాడకం, వాటి దుష్ఫలితాలపై యువతలో అవగాహన కల్పించాలని నిర్ణయింది. అందుకు వారి దారిలో వెళ్లాలని రీల్స్ కాన్సెఫ్ట్ తెట్టింది. డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ ఆకట్టుకునే విధంగా రీల్స్‌ చేస్తే భారీ నగదు బహుమతి గెలుచుకోవచ్చని ప్రకటించింది. నేటి యువత డ్రగ్స్‌కు బానిసలుగా మారి, జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం రీల్స్ కాన్సెఫ్ట్ తెచ్చింది. డ్రగ్స్ వినియోగం, దాని వల్ల కలిగే దుష్ఫలితాలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం "అంతర్జాతీయ డ్రగ్ అండ్ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవం" సందర్భంగా జూన్ 26న షార్ట్ వీడియో కాంటెస్ట్ నిర్వహిస్తుంది.

జూన్ 20లోపు

డ్రగ్స్ అండ్ ఇట్స్ ఎడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ- పేరుతో తెలంగాణ పోలీస్ శాఖ ఈ కాంటెస్ట్ నిర్వహించనుంది. డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలు, డ్రగ్స్ కు బానిసలైన వారి కుటుంబ సభ్యుల బాధలను రీల్స్‌ ద్వారా ప్రజల కళ్లకు కట్టినట్లు చూపించడమే ఈ పోటీ ఉద్దేశమని ప్రకటించారు. 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు ఈ పోటీలకు అర్హులని పోలీస్ శాఖ తెలిపింది. 3 నిమిషాల నిడివితో వీడియోలు రూపొందించాలని పేర్కొంది. జూన్ 20లోపు ఈ వీడియోలను పంపాలని సూచించింది. ఈ పోటీలో విజేతలుగా నిలిచిన వారికి నగదు బహుమతులు అందజేయనున్నట్లు పోలీస్ శాఖ ప్రకటించింది. మొదటి విజేతకు రూ. 75 వేలు, రెండో స్థానంలో నిలిచిన వారికి రూ. 50 వేలు, మూడో విజేతకు రూ. 30 వేల నగదు బహుమతి అందజేయనున్నారు. ఈ పోటీలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు మరింత సమాచారం కోసం 96523 94751 నంబర్‌ను సంప్రదించాలని పోలీస్ శాఖ సూచించింది.

IPL_Entry_Point