TG Govt Job Notification 2024 : తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. వైద్యారోగ్య శాఖలో 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. జులై 2వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. జులై 11వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ లో భాగంగా మొత్తం 32 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ దరఖాస్తులకు జూలై 11వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. శాశ్వత ప్రతిపాదికన ఈ ఉద్యోగాలను రిక్రూట్ చేస్తున్నారు.