IAS Transfers : తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ, అదనపు బాధ్యతలు - ఉత్తర్వులు జారీ-telangana government transfers nine ias officers ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ias Transfers : తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ, అదనపు బాధ్యతలు - ఉత్తర్వులు జారీ

IAS Transfers : తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ, అదనపు బాధ్యతలు - ఉత్తర్వులు జారీ

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 31, 2024 10:40 PM IST

తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మరికొందరికి అదనపు బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా తఫ్సీర్‌ ఇక్బాల్‌కు అదనపు బాధ్యతలను అప్పగించారు.

పలువురు ఐఏఎస్‌ల బదిలీ
పలువురు ఐఏఎస్‌ల బదిలీ

తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఇదే సమయంలో పలువురు అధికారులకు ప్రభుత్వం అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు.

గనులశాఖ డైరెక్టర్‌గా కె. సురేంద్ర మోహన్‌ అదనపు బాధ్యతలను నిర్వర్తించనున్నారు. భూసేకరణ, పునరావాస కమిషనర్‌గా టి. వినయ్‌ కృష్ణారెడ్డికి అదనపు బాధ్యతలు ఇచ్చింది. మైనారిటీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా కొనసాగుతున్న ఆయేషా మస్రత్‌ ఖానంను జీఏడీలో రిపోర్టులో చేయాలని ఆదేశిచింది.

ఆయేషా మస్రత్‌ ఖానంను తప్పించటంతో మైనారిటీ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా తఫ్సీర్‌ ఇక్బాల్‌ కు అదనపు బాధ్యతలను అప్పగించింది. మైనారిటీ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా షేక్‌ యాస్మిన్‌ బాషాకు అదనపు బాధ్యతలు ఇచ్చింది. మైనారిటీ ఆర్థిక సంస్థ ఎండీగా నిర్మలా కాంతి వెస్లీ అదనపు బాధ్యతలను చూడనున్నారు.

ఇక వక్ఫ్‌ బోర్డ్‌ సీఈవోగా మహ్మద్‌ అసదుల్లా నియమితులయ్యారు. ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీగా జి.మల్సూర్‌కు అదనపు బాధ్యతలను ఇచ్చింది. ఖమ్మం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పి. శ్రీజను బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ
పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ

మీసేవలో కొత్త సేవలు:

మరోవైపు ‘మీ-సేవ’ సేవలకు సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా తొమ్మిది రకాల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. పలు ధ్రువీకరణ పత్రాలను ఎమ్మార్వో ఆఫీసుల్లో కాకుండా నేరుగా ఆన్ లైన్ ద్వారానే పొందేలా చర్యలు తీసుకుంది. ఈ మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ కార్యాలయం వివరాలను వెల్లడించింది. ఈ 9 రకాల పత్రాలకు సంబంధించిన వివరాలు ‘మీ సేవ’లో ఉంచేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.

సీసీఎల్ఏ తాజా నిర్ణయంతో పౌరులకు మరింత మెరుగైన సేవలు అందనున్నాయి. ఇందులో భాగంగా… స్టడీ గ్యాప్‌ సర్టిఫికెట్‌, ఖాస్రా/ పహాణీలు, ఆర్వోఆర్‌-1(బి) సర్టిఫైడ్‌ కాపీలు, పౌరుల పేరు మార్పు, స్థానికత నిర్ధారణ (లోకల్‌ క్యాండిడేట్‌), క్రిమీలేయర్, నాన్‌ క్రిమీలేయర్‌, మైనారిటీ ధ్రువీకరణ పత్రం, మార్కెట్‌ వాల్యూ కాపీలను నేరుగా మీసేవ ద్వారానే పొందే అవకాశం ఉంటుంది.