TG MeeSeva Mobile App : తెలంగాణ ప్రజలకు బిగ్ రిలీఫ్.. ఇకనుంచి మొబైల్‌లోనే పౌరసేవలు.. అందుబాటులోకి యాప్-telangana government has launched meeseva mobile app to facilitate access to civic services ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Meeseva Mobile App : తెలంగాణ ప్రజలకు బిగ్ రిలీఫ్.. ఇకనుంచి మొబైల్‌లోనే పౌరసేవలు.. అందుబాటులోకి యాప్

TG MeeSeva Mobile App : తెలంగాణ ప్రజలకు బిగ్ రిలీఫ్.. ఇకనుంచి మొబైల్‌లోనే పౌరసేవలు.. అందుబాటులోకి యాప్

Basani Shiva Kumar HT Telugu
Dec 09, 2024 01:13 PM IST

TG MeeSeva Mobile App : తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. పౌరసేవలను మరింత సులభతరం చేయనుంది. సరికొత్త మొబైల్ యాప్‌ ను అందుబాటులోకి తేనుంది. దీని ద్వారా పౌరులకు సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. ఈ యాప్‌తో ఇంటి వద్దే పౌర సేవలు అందనున్నాయి.

మొబైల్‌లోనే పౌరసేవలు
మొబైల్‌లోనే పౌరసేవలు

తెలంగాణ ప్రజలు ఇంటి నుంచే పౌరసేవలు పొందేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా మీసేవ యాప్‌‌ను ఐటీశాఖ సిద్ధం చేసింది. ఈ యాప్‌ ద్వారా దాదాపు 150 రకాల పౌర సేవలను పొందవచ్చు. హైదరాబాద్ మెట్రో స్టేషన్లు, షాపింగ్‌ మాల్స్, కలెక్టరేట్లు వంటి రద్దీ ప్రాంతాల్లో ఇంటరాక్టివ్‌ కియోస్క్‌ ద్వారా కూడా ప్రజలు పౌర సేవలు పొందవచ్చు. డిజిటల్ చెల్లింపులు, అప్లికేషన్లు, సర్టిఫికెట్‌లు ప్రింట్‌ తీసుకునే అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తోంది.

yearly horoscope entry point

కొత్త సర్వీసులు..

మీసేవలో తెలంగాణ ప్రభుత్వం కొత్త సర్వీసులను చేర్చింది. దివ్యాంగుల గుర్తింపు కార్డులు, వృద్ధుల సంక్షేమ కేసుల పర్యవేక్షణ, సదరం సర్టిఫికెట్ల జారీ, టూరిజం హోటల్స్, ప్యాకేజీల బుకింగ్, పర్మిట్ల రెన్యూవల్, కొత్తవి జారీ చేయటం, వాల్టా చట్టం కింద చెట్ల తొలగింపు, తరలించేందుకు అనుమతులకు సంబంధించిన సర్వీసులను మీసేవలో చేర్చింది. ఈ నిర్ణయంతో ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పింది.

రూ.300కే ఇంటర్‌నెట్..

గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్‌నెట్‌ విప్లవానికి రేవంత్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.300కే ఇంటర్‌నెట్ కనెక్షన్‌ అందుబాటులోకి తీసుకురానుంది. లక్షల ఇళ్లకు దశలవారీగా ప్రభుత్వం ఇంటర్ నెట్ సౌకర్యం కల్పించనుంది. ఈ కనెక్షన్‌ తీసుకుంటే వర్చువల్‌ నెట్‌వర్క్‌తో పాటు.. టెలిఫోన్, తెలుగు ఓటీటీలను ప్రజలు చూడటానికి వీలుంటుంది. మొదటి దశలో నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లోని 2,096 పంచాయతీల్లో దీన్ని అమలు చేయనున్నారు.

20 ఎంబీపీఎస్ స్పీడ్‌తో..

ఈ కనెక్షన్‌ తీసుకుంటే ప్రతి ఇంట్లో ఉన్న టీవీనే కంప్యూటర్‌గా మారుతుందని అధికారులు చెబుతున్నారు. 20 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో కనెక్షన్‌ ఇస్తారని చెబుతున్నారు. ఈ కనెక్షన్‌ ద్వారా చెల్లింపులు కూడా చేయవచ్చని.. గ్రామంలోని అన్ని కార్యాలయాలకు, స్కూళ్లకు కూడా కనెక్షన్‌ ఇవ్వనున్నట్టు అధికారులు వివరిస్తున్నారు. టీవీనే కంప్యూటర్‌గా మారుతుంది కాబట్టి విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే అవకాశముంది.

సీఎం మాట్లాడే అవకాశం..

ఈ కనెక్షన్‌ తీసుకునేవారితో హైదరాబాద్‌ నుంచే ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడే వీలు కలుగుతుందని.. అధికారులు చెబుతున్నారు. ప్రతి గ్రామంలోనూ జంక్షన్లు, ఇతర చోట్ల కూడా అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి.. ఫైబర్‌ నెట్‌తో అనుసంధానం చేయబోతున్నారు. ఇవి ప్రతి పోలీస్ స్టేషన్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానమవుతాయని అధికారులు వివరిస్తున్నారు.

Whats_app_banner