తెలంగాణలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇన్ని రోజులు జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టింది. జనవరి 11 నుంచి జనవరి 17వ తేదీ వరకు వారం రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పాఠశాలలు తిరిగి జనవరి 18న అంటే శనివారం తెరుచుకోనున్నాయి. సెలవులపై క్లారిటీ రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను సొంతూళ్లకు తీసుకెళ్లడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.
ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం.. సంక్రాంతి మూడు రోజులు సెలవులు ఉంది. జనవరి 13వ తేదీన భోగి, జనవరి 14వ తేదీన సంక్రాంతి ఉంది. ఈ సెలవులను జనరల్ హాలీడేస్‌గా పేర్కొంది. ఇక ఆప్షన్ హాలీ డేస్ కింద జనవరి 15వ తేదీన కనుమ ఉంది. ప్రభుత్వం ప్రకటించిన సెలవుల జాబితా ప్రకారం అయితే మూడు రోజులు మాత్రమే ఉంటుంది. కానీ.. తాజాగా మార్పులను ప్రభుత్వం ప్రకటించి.. జనవరి 11 నుంచి 17 వరకు సెలవులు ఇచ్చింది.
ఈ2025 ఏడాదికి గానూ సాధారణ, ఆప్షనల్ సెలవులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై ఇటీవలనే ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాదిలో మొత్తం 27 సాధారణ సెలవులు ఉంటాయని పేర్కొంది. ఇక 23 ఐచ్ఛిక సెలవులు ఉన్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది.
జనవరి 1న తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ హాలీడే ప్రకటించిన సంగతి తెలిసిందే. నూతన సంవత్సరం సందర్భంగా ప్రభుత్వం సెలవు ఇచ్చింది. అయితే.. ఫిబ్రవరి 10న రెండో శనివారం రోజు సెలవును రద్దు చేసింది. జనవరి 1న ఇచ్చిన సెలవుకు బదులుగా.. ఫిబ్రవరి 10న రెండో శనివారం రోజున స్కూళ్లు తెరవనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
కొత్త సంవత్సరం – జనవరి 1, 2025
సంక్రాంతి – జనవరి 14, 2025
రిపబ్లిక్ డే – జనవరి 26, 2025
మహా శివరాత్రి – ఫిబ్రవరి 26, 2025
ఈద్ ఉల్ ఫితర్ – మార్చి 31, 2025
బాబు జగ్జీవన్ రామ్ జయంతి – ఏప్రిల్ 5, 2025
శ్రీరామ నవమి – ఏప్రిల్ 6, 2025
అంబేడ్కర్ జయంతి – ఏప్రిల్ 14, 2025
గుడ్ ఫ్రైడే – ఏప్రిల్ 18, 2025
శ్రీ కృష్ణాష్టమి – ఆగస్టు 16, 2025
వినాయక చవితి – ఆగస్టు 27, 2025
ఈద్ మిలాదు నబీ – సెప్టెంబర్ 5, 2025
బతుకమ్మ మొదటి రోజు – సెప్టెంబర్ 21, 2025
దసరా/గాంధీ జయంతి – అక్టోబర్ 2, 2025
విజయదశమి తర్వాతి రోజు – అక్టోబర్ 3, 2025
దీపావళి – అక్టోబర్ 20, 2025
కార్తీక పౌర్ణమి/గురునానక్ జయంతి – నవంబర్ 5, 2025
క్రిస్మస్ తర్వాతి రోజు – డిసెంబర్ 26, 2025
హజరత్ అలీ పుట్టినరోజు - జనవరి 14
శ్రీ పంచమి - 3 ఫిబ్రవరి, 2025
షబ్ ఈ బరత్ - 14 ఫిబ్రవరి, 2025
మహవీర్ జయంతి - 10 ఏప్రిల్ 2025
అంబేడ్కర్ జయంతి - 14 ఏప్రిల్, 2025.