Telangana Budget 2024-25 : రూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్ - శాఖలవారీగా కేటాయింపులివే..!-telangana finanace minister presented annual budget for fy 2024 25 with a total outlay of rs 291159 crores ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Budget 2024-25 : రూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్ - శాఖలవారీగా కేటాయింపులివే..!

Telangana Budget 2024-25 : రూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్ - శాఖలవారీగా కేటాయింపులివే..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 25, 2024 01:46 PM IST

Telangana Budget 2024 - 25 : తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పద్దును ప్రవేశపెట్టారు. రూ.2,91,159కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకువచ్చారు.

తెలంగాణ బడ్జెట్ - కేటాయింపులు
తెలంగాణ బడ్జెట్ - కేటాయింపులు

Telangana Budget 2024 - 25 : తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,91,159కోట్లతో కూడిన పద్దును సభ ముందుకు తీసుకువచ్చినట్లు తన ప్రసంగంలో తెలిపారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు కాగా… మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా ఉందని పేర్కొన్నారు.

yearly horoscope entry point

తెలంగాణ బడ్జెట్ స్వరూపం - కేటాయింపులు

  • తెలంగాణ బడ్జెట్ : రూ.2 లక్షల 91 వేల 159 కోట్లు.
  • రెవెన్యూ వ్యయం : రూ.2,20,945 కోట్లు.
  • మూలధన వ్యయం :రూ.33,487 కోట్లు.

కేటాయింపులు…

  • వ్యవసాయం ,అనుబంధ రంగాలకు- రూ. 72,659 కోట్లు
  • ప్రజాపంపిణీ వ్యవస్థ -రూ. 3836కోట్లు
  • పంచాయతీ రాజ్- రూ. 29816 కోట్లు
  • మహిళా శక్తి క్యాంటిన్ - రూ. 50 కోట్లు
  • హార్టి కల్చర్ - రూ.737 కోట్లు
  • జీహెచ్ఎంసీ- రూ. 3000కోట్లు
  • హెచ్ ఎండీఏ- రూ. 500 కోట్లు
  • పశుసంవర్ధక శాఖ - రూ. 19080కోట్లు
  • మహాలక్ష్మి ఉచిర రవాణా -రూ. 723కోట్లు
  • గృహజ్యోతి-రూ. 2418కోట్లు
  • హైదరాబాద్ అభివృద్ధి- రూ. 10,000 కోట్లు
  • మెట్రో వాటర్- రూ. 3385 కోట్లు
  • హైడ్రా-రూ. 200 కోట్లు
  • ఎయిర్ పోర్టు మెట్రో- రూ. 100 కోట్లు
  • ఓఆర్ ఆర్ - రూ. 200 కోట్లు
  • స్త్రీ ,శిశు సంక్షేమం - రూ. 2736కోట్లు
  • హైదరాబాద్ మెట్రో- రూ. 500 కోట్లు
  • ఓల్డ్ సిటీ మెట్రో-రూ. 500 కోట్లు
  • మూసీ అభివృద్ధి-రూ. 1500 కోట్లు
  • రీజినల్ రింగ్ రోడ్డు-రూ.1500 కోట్లు
  • ఎస్సీ ,ఎస్టీ సంక్షేమం-రూ.17000 కోట్లు
  • మైనారిటీ సంక్షేమం-రూ. 3000 కోట్లు
  • బీసీ సంక్షేమం-రూ. 9200 కోట్లు
  • వైద్య ఆరోగ్యం-రూ. 11468 కోట్లు
  • విద్యుత్ రంగం-రూ. 16410 కోట్లు
  • అడవులు ,పర్యావరణం- రూ. 1064 కోట్లు
  • ఐటి- రూ.774కోట్లు
  • నీటి పారుదల -రూ. 22301 కోట్లు
  • విద్యా రంగం - రూ. 21292 కోట్లు
  • హోం శాఖ- రూ. 9564కోట్లు
  • ఆర్ అండ్ బి-రూ. 5790కోట్లు
  • జీహెచ్ఎంసి పరిధిలో మౌలిక వసతులు కల్పనకు - రూ.3065 కోట్లు
  • హెచ్ఎండిఏ పరిధిలో మౌలిక వసతులు కల్పనకు - రూ. 500 కోట్లు
  • మెట్రో వాటర్ వర్క్స్ - రూ. 3385 కోట్లు
  • హైడ్రాకి 200 - రూ. కోట్లు
  • ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు - రూ. 100 కోట్లు
  • ఔటర్ రింగ్ రోడ్డు - రూ. 200 కోట్లు
  • హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు- రూ. 500 కోట్లు
  • పాత నగరంలో మెట్రో విస్తరణకు- రూ. 500 కోట్లు
  • మల్టీ మోడల్ సబర్బన్ రైలు ట్రాన్స్పోర్ట్ సిస్టం - రూ. 50 కోట్లు
  • మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ - రూ.1500 కోట్లు
  • బీసీ సంక్షేమం - రూ. 9200 కోట్లు
  • మైనార్టీ శాఖకు - రూ. 3003 కోట్లు
  • ఎస్సి సంక్షేమం - రూ. 33124కోట్లు
  • ఎస్టీ సంక్షేమం - రూ.17056 కోట్లు
  • స్త్రీ శిశు సంక్షేమం - రూ. 2736 కోట్లు

Whats_app_banner